చిరంజీవి - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణముగా బ్రేకులు పడడంతో.. ఈ సినిమాలో గెస్ట్‌గా కనబడాల్సిన చరణ్ పాత్రపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా అనుకున్న ప్లాన్స్ అన్ని తల్లకిందులయ్యాయి. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ 30 నిమిషాల రోల్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేశాడు. RRRతో పాటుగా ఆచార్య సినిమా షూటింగ్‌లోను చరణ్ పాల్గొంటాడని అన్నారు. కానీ కరోనా వలన అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. ఇలాంటి టైం లో రామ్ చరణ్ RRR కాదని ఆచార్యకి ఎలా వస్తాడనే అనుమానం మొదలైంది. అయితే చిరు మాత్రం రాజమౌళిని రిక్వెస్ట్ చేసాం.. చరణ్ డేట్స్ ఇవ్వమని అడిగామని చెబుతున్నాడు.
ఆచార్య సినిమా స్క్రిప్ట్ లాంటి స్క్రిప్ట్ మళ్లీ దొరుకుతుందో లేదో.... అందుకే చరణ్‌తో కలిసి నేను నటిస్తున్నాను. నా భార్య సురేఖ మమ్మల్ని ఇద్దరినీ ఒకే సినిమాలో చూడాలని కోరిక కోరింది. ఆమె కోరిక మేరకు ఆచార్య స్క్రిప్ట్ రెడీ అయ్యింది. చరణ్ - నేను స్క్రీన్ షేర్ చేసుకోవడానికి దీనికన్నా బెస్ట్ స్క్రిప్ట్ దొరకదు. అందుకే చరణ్ కోసం రాజమౌళిని రిక్వెస్ట్ చేశామంటున్నాడు చిరు. మరి చరణ్ ఆచార్య షూట్‌లో పాల్గొంటే RRR చిత్రీకరణ లేట్ అవ్వుద్ది. కాదు RRR అంటే ఆచార్య చిత్రీకరణ లేట్ అవుతుంది.
ఇక ఆచార్యలో ఆ పాత్ర చరణ్ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి చరణ్ కోసం వెయిట్ చెయ్యాల్సి వచ్చినా చేయాలని అంటున్నాడు చిరు. మరి చిరు రిక్వెస్ట్ ని రాజమౌళి ఒప్పుకుంటాడా? లేదా? అనేది ఇప్పుడు సస్పెన్స్ అంటున్నారు. అయితే చిరు RRR షూటింగ్ చిత్రీకరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఆచార్య షూటింగ్ చేస్తామని.. చరణ్ డేట్స్ ఇస్తే వచ్చే ఏప్రిల్ నాటికి ఆచార్య షూటింగ్ పూర్తి చేస్తామంటున్నాడు చిరు.