Advertisement
Google Ads BL

ఆదిపురుష్‌లో రామాయణం లేదా??


ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిపురుష్‌తో సినిమాని పట్టాలెక్కించేందుకు తహతహలాడుతున్నాడు. అయితే ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాని ప్రకటించినప్పటి నుండి.. ఈ సినిమా రామాయణానికి ఆధారముగా తెరకెక్కుతోందని... ఆదిపురుష్‌లో రాముడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడనే టాక్ మొదలయ్యింది. దానికి ఆధారంగానే రాముడి భార్య సీత పాత్రకి హీరోయిన్స్, రావణ్ పాత్రకి సైఫ్ అలీఖాన్, లక్షణుడి పాత్రకి సౌత్ హీరో అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాముడిగా ప్రభాస్ బాడీ షేప్, ఆయన ఆహార్యం అన్ని పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయని.. ఓం రౌత్ రామాయణాన్ని ఆదిపురుష్‌గా మలచబోతున్నాడనే ఊహాగానాలు ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Advertisement
CJ Advs

అయితే రామాయణంలోని రాముడి పాత్ర, సీత, లక్ష్మణుడి, హనుమంతుని పాత్రలను ఆదిపురుష్ పాత్రలు పోలి ఉంటాయని.. కానీ రామాయణాన్ని ఓం రౌత్ చూపించడం లేదని, అసలు రామాయణంలో ఉన్న యుద్ధ, అడవి ఘట్టాలాంటివి ఏమి ఆదిపురుష్‌లో చూపించడం లేదని.. పురాణంలోని పాత్రలని ఆదిపురుష్‌కి ఆపాదించారు తప్ప ఆదిపురుష్‌కి రామాయణం కథకి సంబంధం లేదని తెలుస్తుంది. ఓం రౌత్ ఆదిపురుష్‌ని నేటి సమాజంలో జరిగే కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడని బి టౌన్ టాక్. 

మరి ప్రభాస్ రాముడి అవతారంలో ఊహించుకున్న వాళ్ళకి ఈ న్యూస్ కాస్త చేదు వార్తే అయినా.. రాముడి గుణగణాలతోనే ప్రభాస్ ఆదిపురుష్ పాత్ర డిజైన్ చెయ్యడం జరిగింది అని తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఆదిపురుష్ రామాయణం కథకి సంబంధం లేదనేది పక్కా అంటున్నారు.

Prabhas Adipurush Not Based On Ramayan:

Shock: Adipurush Has No Connection With Ramayan  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs