Advertisement
Google Ads BL

డ్రగ్స్‌ కేస్‌: ఈ హీరోయిన్ల పరిస్థితేంటి?


బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు.. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లిందో అనేది మీడియాలో చూస్తూనే ఉన్నాం. చిన్న చేప ఎన్‌సీబీ వలలో పడితే.. చివరికి పెద్ద చేపలు గాలానికి చిక్కేలా చేసింది ఆ చిన్న చేప. సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారి బాలీవుడ్ టాప్ తారల మెడకి చుట్టుకుంది. తాజాగా రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ టాలెంట్ మేనేజర్ జయ సాహా, దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా చెప్పిన సాక్ష్యాలతో బాలీవుడ్ బడా హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్ద కపూర్, సారా అలీఖాన్ లకు అలాగే సౌత్ హీరోయిన్ రియా ఫ్రెండ్ రకుల్ ప్రీత్ కి ఈ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ సమన్లు జారీ చెయ్యడంతో ఈ కేసు రసవత్తరంగా మారింది. నిన్నమొన్నటి వరకు ఊహాగానాలుగా మీడియా కెక్కిన పేర్లు ఈ రోజు ఎన్‌సీబీ ముందు విచారణకు హాజరయ్యేలా ఉంది. రకుల్ నేడు ఎన్‌సీబీ ముందుకు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవ్వాల్సి ఉండగా.. దీపికా రేపు ఎన్‌సీబీ ఎదుటపడాలి.

Advertisement
CJ Advs

అయితే దీపికా పదుకొనె కేసు వాదించడానికి 12 మంది లాయర్ల బృందం రెడీగా ఉందనే విషయం మీడియాలో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం గోవాలో సినిమా షూటింగ్ లో ఉన్న దీపికా లాయర్లతో చర్చలు జరుపుతున్నట్టుగా టాక్. ఇక శ్రద్ద కపూర్, సారా అలీఖాన్ లు కూడా ఈ విచారణలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు టాప్ తారల పేర్లు డ్రగ్స్ కేసులో బయటికి రావడంతో వారి కెరీర్ ఏమవుతుందో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రకుల్ కెరీర్ ఇప్పటికే అంతంత మాత్రంగా ఉంటే.. దీపికా టాప్ గేర్‌లో దూసుకుపోతుంది. 

అసలే ప్రభాస్ తో ఓ స్ట్రయిట్ తెలుగు మూవీ కూడా చేస్తుంది. ఇక సారా అలీఖాన్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న తార, ఇక శ్రద్ద కపూర్ కి అంతంత మాత్రం అవకాశాలే. ఈ డ్రగ్స్ కేసుతో తారల కెరీర్ ఎలా ఉన్నా ప్రేక్షకులు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది.

Star heroines in Drugs scandal:

Drugs Scandal: What about these Heroines Future?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs