నటులు శ్రీ వేణుగోపాల్ హఠాన్మరణం మమల్ని తీవ్ర దిగబ్రాంతికి గురి చేసింది - రోరి చిత్ర బృందం
సిటిఎఫ్ స్టూడీయోస్ పతాకంపై హీరో చరణ్ రోరి స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రోరి. ఈ సినిమాలో ప్రముఖ నటులు వేణుగోపాల్ గారు కీలక పాత్ర పోషించారు. అయితే దురదృష్ట వసాత్తు ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందంతో పాటు హీరో చరణ్ రోరి, నటులు శ్రీ వేణుగోపాల్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని, తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అద్భుతమైన పెర్ఫార్మర్ ని కోల్పోయిందని చింతిస్తూ వారి కుంటుంబ సభ్యులకు, సన్నిహితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.