Advertisement
Google Ads BL

అది చైతూని చూసి నేర్చుకుంటున్నా: సమంత


పెళ్లి తర్వాత కూడా రాకెట్ స్పీడు‌తో టాప్ పొజిషన్‌ని నిలబెట్టుకుంటున్న అక్కినేని సమంత.. ఇప్పటికీ హాట్ యాంగిల్స్‌తో.. స్పైసీ షూట్స్‌తో యంగ్ హీరోయిన్స్‌కి గట్టిపోటీ ఇస్తుంది. అయితే తనకి ఒకప్పుడు తన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలా భయంగా ఉండేదట. సినిమా విడుదలయ్యే ముందు రోజు రాత్రి చిత్ర బృందాన్ని అసలు నిద్రపోనివ్వకుండా ఫోన్స్ చేసి.. సినిమా హిట్ అవుతుందా? లేదా అంటూ అందరికి నిద్ర కరువు చేస్తుందట. ఇదే విషయాన్ని సమంత స్వయంగా చెబుతుంది. కానీ ఇప్పుడు అంటే కెరీర్‌లో ఓ స్టేజ్ కి చేరుకున్నాక అంత ఒత్తిడి తీసుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది.

Advertisement
CJ Advs

ఇక ఒకసారి కథ నచ్చి సినిమా ఒప్పుకున్నాక దాని గురించి ఆలోచించనని.. ఒకవేళ ఆ సినిమా ఫలితం గురించే ఆలోచిస్తే.. సన్నివేశాల్లో నేచురల్‌గా నటించడం కష్టం కాబట్టే.. విన్నవెంటనే కథ నచ్చగానే దాన్ని అక్కడే మర్చిపోతా అంటుంది సమంత. ఇక దర్శక నిర్మాతలు చెప్పిన టైం కి సెట్స్ కి వెళ్ళామా? లేదా? దర్శకుడు చెప్పినట్టు నటించామా? లేదా? అనేది చూసుకుంటాను. అంతేకానీ సినిమా ఫలితంపై దృష్టి పెడితే... మనం నటించే సన్నివేశం పాడవుతుంది అంటోంది. 

ఇక సినిమా విషయంలో మన ప్రయత్నం మనం చెయ్యాలి.. మిగతాది ప్రేక్షకులకే వదిలేయాలంటుంది సమంత. ఇక ఎంత ఒత్తిడిని తగ్గించుకుందామనుకున్నా.. సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. అయితే సినిమా ఫలితంపై టెన్షన్ పడకుండా కూల్ గా ఉండడమనేది చైతుని చూసి నేర్చుకుంటున్నా అని చెబుతుంది సమంత.

Samantha learned that from Naga Chaitanya:

Samantha feeling on Her movie release 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs