సుశాంత్ రాజ్ పుత్ బలవన్మరణం తర్వాత ఆ మరణానికి సంబంధించిన కేసు దర్యాప్తులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి బయటపడింది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ రిమాండ్ లో ఉన్నారు. అయితే తాజాగా మరో నలుగురు బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు బయటకి వచ్చాయి.
మాదక ద్రవ్యాల కేసులో ప్రశ్నించడానికి దీపికా పదుకునే, సారా ఆలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లకి ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నలుగురు హీరోయిన్లు ఎన్సీబీ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. వీరితో పాటు ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ కంబట్టకి సమన్లు జారీ చేసారు. మొదట రకుల్, సారాల పేర్లు బయటకు వచ్చినప్పటికీ ఆ తర్వాత వారి పేర్లు లేవని చెప్పడంతో సారీ రకుల్, సారీ సారా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైంది. కానీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ వారిద్దరి పేర్లు లిస్టులో కనబడ్డాయి.