ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా ఆదిపురుష్ మూవీ తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఆదిపురుష్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చెయ్యడమే కాదు... ఆదిపురుష్‌కి సంబందించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓం రౌత్, ప్రభాస్‌కి ఫోన్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఆదిపురుష్ ప్రీ ప్రొడక్షన్స్ పనులు చూస్తున్నాడు. ప్రభాస్ కూడా ఆదిపురుష్ కోసం జిమ్ చెయ్యడమే కాదు... హిందీ లాంగ్వేజ్ పర్‌ఫెక్ట్‌గా నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఇక దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ నటీనటుల ఎంపిక ఒక్కొక్కరిగా చేపట్టాడు. ఇప్పటికే ఆదిపురుష్ విలన్‌గా సైఫ్ అలీఖాన్‌ని రావణ్ పాత్రకి ఎంపిక చేసిన ఓం రౌత్ హీరోయిన్ విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.
సౌత్ హీరోయిన్ అయితే సినిమాకి క్రేజ్ వస్తుందో రాదో అని ఓం రౌత్ బాలీవుడ్‌లోనే సీతని పట్టుకునే పనిలో ఉన్నాడట. ఇక ఆదిపురుష్‌లో ప్రభాస్ తమ్ముడిగా అంటే రాముడి తమ్ముడు లక్షణుడు పాత్రకి ఓ యంగ్ సౌత్ హీరోని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
గత ఏడాది గద్దలకొండ గణేష్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అథర్వ మురళిని లక్షణుడి పాత్రకి ఎంపిక చేసినట్టుగా బిటౌన్ టాక్. ఓం రౌత్ అథర్వ మురళికి ఫోన్‌లోనే తన పాత్రని వివరించాడని.. పాన్ ఇండియా మూవీలో అలాంటి పాత్రని ఎవరు వదులుకుంటారు.. అందుకే అథర్వ మురళి కూడా ఆదిపురుష్ లక్షణ్ పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.