Advertisement
Google Ads BL

తమన్నా ఆ బోల్డ్ పాత్ర చేయడానికి కారణం?


ఈ మధ్య కాలంలో తమన్నాకి బాహుబలి, సైరా మినహా చెప్పుకోదగిన సినిమాలేవీ పడకపోయినా.. తమన్నా మాత్రం ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. పారితోషకం భారీగా ఉంటే ఐటెం సాంగ్స్ కూడా దున్నేస్తుంది. ప్రస్తుతం ఫెడవుడ్ లిస్ట్‌కి దగ్గరగా ఉన్న తమన్నాకి ఏ అవకాశం వచ్చినా వదలడం లేదు. తాజాగా నితిన్ బాలీవుడ్ అంధాధూన్ సినిమాలో తమన్నా నెగెటివ్ రోల్‌లో నటించబోతుంది. హిందీలో అంధాధూన్ సినిమాలో ఈ నెగెటివ్ రోల్‌లో టబు నటించింది. ఆ బోల్డ్ పెరఫార్మెన్సుకి అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు అదే రోల్‌ని తెలుగులో తమన్నా చేస్తుంది. నిన్నమొన్నటి వరకు అనసూయ, రమ్యకృష్ణ, ఇలియానా, నయనతార పేర్లు వినబడినా శ్రియ ఫైనల్ అన్నాక ఆమె వేరే దేశంలో ఉండడంతో చివరికి ఆ బోల్డ్ ఛాన్స్ తమన్నాకి దొరికింది.

Advertisement
CJ Advs

ఇంకా హీరోయిన్‌గా కంటిన్యూ చేస్తున్న తమన్నా ఈ బోల్డ్ పాత్ర చెయ్యడం కాస్త షాకింగ్‌గా అనిపించినా... ఆమె పారితోషకానికి పడిపోయింది అనే టాక్ మొదలైంది. అంధాధూన్ రీమేక్‌లో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ పాత్ర చెయ్యడానికి నితిన్ నిర్మాతలు నుండి ఏకంగా కోటిన్నర పట్టుకెళుతుందట. 

మరి హీరోయిన్‌గా ఇంకా చేతిలో సినిమాలు ఉన్న టైంలో తెగించి బోల్డ్ నెగెటివ్ పాత్ర చెయ్యడానికి కోటిన్నరే కారణమంటున్నారు. ఫేడవుట్ అయ్యే టైంలో ఎలాంటి పాత్ర అయినా చేయాలనీ తమన్నా డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. అయితే టబు చేసిన ఆ పాత్రని తమన్నా రక్తి కట్టించగలదా అనే సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి.

Tamanna Finalized in Andhadhun Remake:

1.5 cr remuneration of Tamanna in Andhadhun Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs