లఘు చిత్రాల ద్వారా పరిచయమై హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే తనకంటూ గుర్తింపు ఏర్పర్చుకుంటున్న చాందినీ చౌదరీ, ప్రస్తుతం కలర్ ఫోటో సినిమాలో నటించింది. సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ లో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన చాందినీ చౌదరి, తనకి ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్లతో పనిచేయాలని ఉందని తెలిపింది. ఐతే చాందినీ కామెంట్ ని ట్రోల్ చేస్తూ ఒక నెటిజన్, నాకు గూగూల్ సీఈవో సుందర్ పిచాయ్ తో వర్క్ చేయాలని ఉంది. కానీ అవ్వవుగా అని పోస్ట్ పెట్టాడు.
ఆ నెటిజన్ కి కౌంటర్ వేసిన చాందినీ ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ఎక్కడో ఎవరో సాధించి చూపేంతవరకూ అన్నీ అసాధ్యమే. నేను నా కల కోసం కష్టపడుతున్నాను. కాబట్టి ఎప్పుడో ఒకరోజు నేను అనుకున్నది సాధిస్తాను. మీరు ట్రోల్ చేసే బదులు పని చేసుకుంటూ కూర్చుంటే సుందర్ పిచాయ్ ని కలుస్తారేమో.. అంటూ పోస్ట్ పెట్టింది. మొత్తానికి పంచ్ గట్టిగానే ఇచ్చిందిగా.