Advertisement
Google Ads BL

బన్నీకి ఆ భామే కావాలంట..!!


సుకుమార్  - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోయే పుష్ప సినిమా లొకేషన్స్ వేటలో మూవీ యూనిట్ తలమునకలై ఉంది. నిన్నగాక మొన్న బన్నీ పుష్ప టీంతో కుంటాల జలపాతంలో పాటుగా మహారాష్ట్రలో అడవుల్లో లొకేషన్స్ సెర్చింగ్‌లో పాల్గొనడం అది కాస్తా కేసవడం జరిగింది. కరోనా పరిస్థితులకు అనుగుణంగా పుష్ప షూటింగ్ మొదలు పెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ నుండి పుష్ప సినిమాని పట్టాలెక్కించడానికి సుకుమార్ శతవిధాలా కష్టపడుతున్నాడు. అల్లు అర్జున్ కూడా సుక్కు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీ అంటున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి‌ జోడిగా రష్మిక మందన్న నటిస్తుంది. రష్మిక ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్‌లో కనిపిస్తుంది. అయితే పాన్ ఇండియా మూవీకి సౌత్ హీరోయిన్‌తోనే సరిపెడితే కుదరదని సుక్కు - అల్లు అర్జున్ భావించారట.

Advertisement
CJ Advs

అందుకే బాలీవుడ్ భామతోనే ఐటెం సాంగ్ ప్లాన్ చేసుకోవడం.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న దిశా పటానిని సంప్రదించడం జరిగిందట. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజ్ మీదున్న దిశా పటాని పుష్ప ఐటెం సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేసిందట.

సరే ఓకే అనుకున్న తరుణంలో కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చెయ్యడమే కాదు.. ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ అన్ని బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడంతో దిశా పటాని ప్లేస్‌లోకి మరో హీరోయిన్‌ని తీసుకుందామని అల్లు అర్జున్‌ని సుక్కు అడగగా.. వద్దు మన సినిమాలో దిశనే ఐటెం గర్ల్.. ఎంతిచ్చయినా తేవాలి అంటున్నాడట. మరి హీరో చెప్పాక నిర్మాతలైనా, సుక్కు అయినా ఏం చేస్తారు దిశనే తెస్తారు.

Allu Arjun wants Disha Patani for Pushpa Item song:

Allu Arjun wants Bollywood beauty for Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs