భీష్మ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్, రంగ్ దే సినిమాని దించుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. నితిన్ పెళ్ళి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కి అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రం మరో మంచి హిట్ గా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఐతే ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది.
ఈ నేపథ్యంలో రంగ్ దే చిత్రంపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. టీజర్ రిలీజ్ చేసినపుడు సంక్రాంతి కానుకగా థియేటర్లలో వస్తామని చెప్పిన చిత్రబృందం డిజటల్ రిలీజ్ వైపు చూస్తుందని అంటున్నారు. డిజిటల్ లో పే పర్ వ్యూ పద్దతిలో రంగ్ దే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం జరుగుతోంది.
ఈ విషయమై చిత్రబృందం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఐతే టీజర్ చూసినవాళ్ళందరూ రంగ్ దే చిత్రం థియేటర్లలో రిలీజ్ అయితేనే బాగుంటుందని చెబుతున్నారు. మరి చిత్రబృందం ఏ విధంగా ప్లాన్ చేస్తుందో చూడాలి.