నాగార్జున సినిమాలు వరసగా ప్లాప్ అయినా బిగ్ బాస్ హోస్ట్‌గా మాత్రం దుమ్ములేపుతున్నాడు. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 3 లో నాగ్ శని ఆదివారాలు ఎపిసోడ్స్ కి భారీ టీఆర్పీ వచ్చేది. అంతేకాకుండా నాగార్జున హోస్టింగ్ లో బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ అదే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి అద్భుతమైన టీఆర్పీ వచ్చింది. సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి 17.9 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే తాజాగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లో పెద్దగా కిక్ ఇవ్వకపోయినా.. ఓపెనింగ్ ఎపిసోడ్ కి మాత్రం నాగ్ దుమ్ము దులిపాడంటున్నారు.
కంటెస్టెంట్స్‌ని పరిచయం చేస్తూ.. నాగ్ తండ్రిగా హోస్ట్‌గా చేసిన ఆ ఎపిసోడ్ నాగ్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే టీఆర్పీని బద్దలు కొట్టింది అంటున్నారు. నాగ్ హోస్టింగ్‌లో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం మొదలయ్యింది. అందులో నాగ్ హోస్టింగ్ కి మంచి టీఆర్పీ వచ్చింది. మరి గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్‌కి ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చిందట.
అంటే నాగార్జున గత సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి వచ్చిన 17.9 టీఆర్పీ రేటింగ్ ని బద్దలు కొడుతూ సీజన్ గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ కు 18.5 టీఆర్పీ రేటింగ్ తీసుకొచ్చి దుమ్ముదులిపాడన్నమాట. మరి సీజన్ 4 అంత ఆసక్తికరంగా లేకపోయినా.. నాగ్ హోస్ట్ చేస్తున్న శని, ఆదివారాలు ఎపిసోడ్స్ ని బుల్లితెర ప్రేక్షకులు మిస్ కావడం లేదు. మరి బిగ్ బాస్ కి ఓపెనింగ్ ఎపిసోడ్, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ ఎంత కీలకమో ఈ టీఆర్పీ ఎపిసోడ్స్ డిసైడ్ చేస్తున్నాయన్నమాట.