Advertisement
Google Ads BL

పాన్ ఇండియా కెళుతున్న ‘సర్కారు వారి పాట’!


మహేష్ బాబు ఇంతవరకు పాన్ ఇండియా ఆలోచనే లేనట్టుగా గడిపేస్తున్నాడు. పరశురామ్ - మహేష్ కాంబోలో సర్కారు వారి పాట కూడా బాలీవుడ్ కి వెళ్లబోతుందా? అనే టాక్ నడిచినా తాజాగా సర్కారు వారి పాట బాలీవుడ్ హక్కులను 14 కోట్లకి నిర్మాతలు విక్రయించినట్లుగా సోషల్ మీడియా టాక్. అయితే మహేష్ సినిమాకి అంత బాలీవుడ్ హంగులు అద్దబోతున్నారనే టాక్ మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

ఇప్పటికే మహేష్ విలన్ గా బాలీవుడో హీరో అనిల్ కపూర్ ని తీసుకుంటున్నారని అంటుంటే.. తాజాగా ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్ పేరు తెర మీదకొచ్చింది. అయితే విద్యా బాలన్ సర్కారు వారి పాటలో మహేష్ కి సోదరి కేరెక్టర్ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించడానికి చిత్ర బృందం ఒప్పించినట్టుగా తెలుస్తుంది. అనిల్ కపూర్ విలన్ గా, విద్యా బాలన్ మహేష్ సోదరిగా బాలీవుడ్ నుండి తేవాలని పరశురామ్ ప్లాన్ అంట. 

అయితే కరోనా కారణంగా పట్టాలెక్కని సర్కారు వారి పాట త్వరలోనే అమెరికాలో మొదటి షెడ్యూల్ మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా మొదటిసారి మహేష్ కి జోడిగా నటించబోతుంది. ఇక సర్కారు వారి పాట యూనిట్ మొత్తం ఇప్పుడు షూటింగ్ ఎలా మొదలు పెట్టాలా అని ప్లాన్ చేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలనే దాని మీద చర్చిస్తున్నారట.

Pan India Craze to Mahesh Babu Sarkaru Vaari Paata:

Anil Kapoor and Vidya Balan in Sarkaru Vaari Paata
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs