ప్రభాస్‌కి మొహమాటమెక్కువ.. తొందరగా ఎవరితోనూ కలవడు. ఇక అతి మంచివాడంటూ చాలా ఫంక్షన్స్‌లో చాలామంది ప్రముఖులు చెప్పారు. అయితే నిజంగానే ప్రభాస్‌కి మొహమాటం ఎక్కువట. ఎదుటి వారిని తొందరగా నమ్మేసే గుణమట. ప్రభాస్ తాజాగా రాధేశ్యామ్‌తో పాటుగా నాగ్ అశ్విన్ మూవీ అలాగే ప్రభాస్ బాలీవుడ్‌లో ఓం రౌత్‌తో ఓ భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అయితే ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ ఏం పట్టనట్టుగా ఉన్నాడని టాక్. మొహమాటమో మరేదన్నానో కానీ దర్శకుడు ఓం రౌత్ ఏది చెబితే అదే ఆదిపురుష్ విషయంలో జరుగుతుందట. ప్రభాస్ పూర్తిగా ఓం రౌత్‌ని నమ్ముతున్నాడట.
ఓం రౌత్ సినిమా మొదలెట్టేద్దాం.. ఓ షెడ్యూల్ అయ్యాక మీ మరొక సినిమాలు చేసుకోండి అని చెబితే అలాగే అన్నాడట ప్రభాస్. ఇక ఆదిపురుష్ విలన్ విషయంలోనూ ప్రభాస్‌ని అడక్కుండానే ఓం రౌత్ తన తానాజీ ఫేమ్ సైఫ్ అలీఖాన్‌ని దింపేసాడట. తర్వాత ప్రభాస్‌కి తెలిసింది. ఇక ఓం రౌత్ విలన్ ఎంపిక కరెక్ట్ కాదని ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. ప్రభాస్ ముందు సైఫ్ అలీఖాన్ తేలిపోతాడని గొడవ చేస్తున్నారు. ఇక ఓం రౌత్ అన్ని డెసిషన్స్ తీసుకున్నాకే తర్వాత ప్రభాస్‌ని ఫోన్‌లో ఒప్పించేస్తున్నాడట.
ఇక ఆదిపురుష్ కోసం ప్రభాస్ ప్రమేయం లేకుండా ఓం రౌత్ బాలీవుడ్‌లోనే ఒక టీం ఏర్పాటు చేసుకుంటున్నాడట. ప్రభాస్‌కి ఇది చెయ్యండి బాడీ ఫిట్‌గా ఉంచండి, హిందీ నేర్చుకోండి అని చెప్పి ఓం రౌత్ ప్రభాస్‌ని మిగతా విషయాల్లో ఇన్వాల్వ్ కానివ్వడం లేదని టాక్. ఇదంతా చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ కాస్త పట్టించుకోవయ్యా.. మొహమాటానికి పోతే సాహో విషయంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అని అంటున్నారట.