Advertisement
Google Ads BL

ఆ కాంబినేషన్ బాగా సెట్టవ్వుద్ది.. రవితేజకి హిట్ గ్యారెంటీ..?


మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఐతే గత కొన్ని రోజులుగా రవితేజకి సరైన హిట్ లేదు. డిస్కోరాజా సినిమాతో రవితేజ మార్కెట్ బాగా డీలా పడింది. ప్రస్తుతం క్రాక్ సినిమాపై ఆశలు ఉన్నాయి. ఈ సినిమా అనంతరం రవితేజ, రమేష వర్మతో సినిమా ఒప్పుకున్నాడు.

Advertisement
CJ Advs

ఐతే తాజాగా రవితేజ హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందని వినిపిస్తుంది. ఈ మధ్య ఫ్యామిలీ డ్రామాలని తెరమీదకి తీసుకొచ్చి బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకుంటున్న మారుతి తర్వాతి చిత్రం రవితేజతో ఉంటుందని అంటున్నారు. ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఐతే రవితేజ అభిమానులు ఈ కాంబినేషన్ సెట్ అయితే బాగుండునని కోరుకుంటున్నారు. హాస్యాన్ని ఎక్కడా మిస్ కానీకుండా ఫ్యామిలీ డ్రామాలని అందంగా అందించడంలో మారుతి సక్సెస్ అవుతూ వస్తున్నాడు. అందువల్ల ఈ కాంబో సెట్ అయితే గనక రవితేజకి హిట్ గ్యారెంటీ అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో..!

Will set interesting combo for a movie..?:

Will set interesting combo for a movie..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs