Advertisement
Google Ads BL

డ్రగ్స్ కేస్‌: ఈ ట్విస్ట్‌లేంటి రియా..?


ప్రస్తుతం డ్రగ్స్ కేసు అన్ని భాషల ఇండస్ట్రీస్‌ని ఓ ఊపు ఊపుతుంది. బాలీవుడ్ నుండి కన్నడ, టాలీవుడ్‌లని తాకిన డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజపుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సుశాంత్ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటూనే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది. సుశాంత్‌కి డ్రగ్స్ ఇవ్వడమే కాకుండా బాలీవుడ్‌లో డ్రగ్స్ పార్టీలు జరిగేవని వాటికీ చాలామంది హాజరయ్యేవారంటూ రియా చెప్పడంతో.. ఇప్పుడు అందరిలో ఒణుకు మొదలయ్యింది. ఈ డ్రగ్స్ కేసులో రియా, ఆవిడ తమ్ముడు వాంగ్మూలంతో డ్రగ్ డీలర్స్‌ని డ్రగ్స్ అమ్మేవారిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. తాజాగా రియా చక్రవర్తి రకుల్ ప్రీత్, సారా అలీఖాన్, ఓ డిజైన్ పేరు ఎన్సీబీ ఎదుట చెప్పగా రకుల్‌ని హైదరాబాద్ మీడియా ఆడుకుంది. రకుల్ కూడా ఎవరికీ కనబడకుండా షూటింగ్ నుండి వెళ్లిపోవడం, తర్వాత ఎన్సీబీ అధికారులు రకుల్ పేరు కానీ, సారా పేరు కానీ రియా మాకు చెప్పలేదు అన్నారు.

Advertisement
CJ Advs

దానితో నెటిజెన్స్ రకుల్‌కి, సారా అలీఖాన్‌కి సోషల్ మీడియాలో సారి చెప్పారు. అంతేకాకుండా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, రకుల్ ప్రీత్‌ని, సారాని సపోర్ట్ చేస్తూ నెటిజెన్స్ సాటి చెప్పిన సారి స్క్రీన్ షార్ట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సారి రకుల్, సారి సారా అంటూ పోస్ట్ పెట్టడంతో ఈ కేసుతో రకుల్‌కి ఎలాంటి సంబంధం లేదని అందరూ ఫిక్స్ అయ్యి రకుల్‌ని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు బాధపడ్డారు. ఉదయం ఈ తతంగం అంటే రకుల్ సారి విషయం నడవగా సాయంత్రానికి ఎన్సీబీ అధికారులు మళ్ళీ రియా తమకి రకుల్ పేరు సారా పేరు చెప్పింది అని... త్వరలోనే వారిని విచారిస్తామని అంటున్నారు. అలాగే రకుల్ ప్రీత్‌కి, సారా అలీఖాన్‌కి ఓ ప్రముఖ డిజైనర్‌కి ఎన్సీబీ సమన్లు జారీ చేయబోతుంది అనే న్యూస్ నడుస్తుంది. 

ఇక బాలీవుడ్‌లో ఎలాంటి సెలబ్రిటీస్ లిస్ట్ తమ వద్ద లేదని రియా ఎవరి పేర్లు చెప్పలేదని కేవలం రకుల్, సారా పేర్లే చెప్పింది అని ఎన్సీబీ అధికారులు చెప్పడంతో మరోమారు రకుల్ ప్రీత్ మీడియాకి అడ్డంగా దొరికింది. అయితే ఈ డ్రగ్స్ విషయమై రకుల్ ప్రీత్ ఇంతవరకు స్పందించలేదు. ఖండించనూ లేదు.

Twists in Rhea drugs scandal case:

Again Rakul and Sara name highlights in drugs scandal case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs