మహేష్ బాబు కరోనాని లైట్ తీసుకోవద్దని అంటున్నాడు. కానీ యాడ్ షూట్స్‌లో మహేష్ జాయిన్ అవుతున్నాడు. మహేష్ బాబుకి సినిమా షూటింగ్ చెయ్యడానికి కరోనా అడ్డం పడుతుంది కానీ.. యాడ్ షూట్స్‌కి కరోనా అడ్డం పడదా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే మహేష్ బాబు - పరశురామ్‌ల కాంబోలో తెరకెక్కాల్సిన సర్కారు వారి పాట అక్టోబర్ నుండి పట్టాలెక్కుతోంది అని.. సినిమా షూటింగ్ అంటే అనేక మంది పనిచేయాలి. అలాంటి చోట కరోనా అంటే కంగారుగా ఉంటుంది అని మహేష్ ఆలోచిస్తున్నాడట. మరి ఇంకా షూటింగ్ మొదలు కానీ సర్కారు వారి పాట ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే టాక్ ఫిలింసర్కిల్స్‌లో వినిపిస్తుంది.
అది మహేష్ బాబు సర్కారు వారి పాటకి డిజిటల్, శాటిలైట్ హక్కుల విక్రయం జరిగింది అని... సర్కారు వారి పాట డిజిటల్ - శాటిలైట్ హక్కుల ధర 35 కోట్లుగా ప్రచారం జరుగుతుంది. 35 కోట్ల భారీ డీల్‌కి ఓ ప్రముఖ సంస్థ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం డిజిటల్, శాటిలైట్‌కే 35 కోట్లట. హిందీ హక్కులు, మిగతా భాషల హక్కులు ఇంకా అమ్ముడు కావాల్సి ఉందట.
మరి మహేష్ సరిలేరు నీకెవ్వరు హిట్ కావడం, పరశురామ్ గీత గోవిందం లాంటి హిట్ ఉండడం, అలాగే కీర్తి సురేష్ హీరోయిన్ కావడంతో సర్కారు వారి పాట మీద భారీ అంచనాలున్నాయి. కాబట్టే ఇంత భారీగా డిజిటల్ హక్కులకి రాబోతున్నాయని అంటున్నారు.