Advertisement
Google Ads BL

‘విరూపాక్ష’ కాదు.. మరో టైటిల్ తెరపైకి..!


పవన్ కళ్యాణ్ ఇంకా వకీల్ సాబ్‌కి సంబందించిన 20 రోజుల షూటింగ్ పూర్తి చెయ్యాలి తర్వాత క్రిష్ సినిమాకి రెడీ అవ్వాలి. కరోనా అంటూ ఇంట్లోనే చాతుర్మాస దీక్ష, ధర్మపరిరక్షణ దీక్షలు చేస్తున్న పవన్ వకీల్ సాబ్ షూటింగ్‌కి ఎప్పుడొస్తాడో అని వకీల్ సాబ్ టీం వెయిటింగ్. అయితే తాజాగా క్రిష్ - పవన్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో మూడు నుండి నాలుగు భాషల్లో తెరకెక్కబోతుంది అని.... పవన్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాల్లోకెల్లా క్రిష్ సినిమానే భారీ బడ్జెట్‌తో కూడుకున్నది కాబట్టి.. ఈ సినిమా హిందీలో కూడా విడుదలవ్వొచ్చని అంటున్నారు. ఇక క్రిష్ - పవన్ కాంబో టైటిల్ విషయమై సోషల్ మీడియాలో ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

ముందు పవన్ - క్రిష్ కాంబో మూవీకి విరూపాక్ష టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఆ టైటిల్ చాలా రోజులుగా ప్రచారంలో ఉండగా.. తర్వాత పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడని, దొంగగా పవన్ పాత్ర ఉంటుంది కాబట్టి దొంగ అనే టైటిల్ అనుకున్నారు. 

అయితే తాజాగా పవన్ - క్రిష్ కాంబో టైటిల్‌గా ఓం శివమ్ పెట్టబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సినిమా నిర్మాతలు ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించారని ఫైనల్‌గా ఓం శివమ్ టైటిల్ ఫిక్స్ అంటున్నారు. మరి పవన్ ఎలాగూ సినిమాల విషయం మీడియా‌తో స్పందించడు. ఇక క్రిష్ కానీ నిర్మాతలు కానీ ఈ టైటిల్‌ని కన్ఫర్మ్ చేస్తే ఓకే.. లేదంటే ఇది ఓ గాసిప్ టైటిల్ అవడం ఖాయం.

Pawan Kalyan and Krish Film to Be Titled OM Shivam?:

4th Title in Talks for Pawan and Krish Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs