Advertisement
Google Ads BL

ప్రభాస్ చూపంతా ఆ సినిమాపైనే ఉందా?


ప్రభాస్ ప్రస్తుతం కరోనా ఉన్నప్పటికీ రాధాకృష్ణ రాధేశ్యామ్ షూటింగ్ మొదలెట్టబోతున్నాడని టాక్ ఉంది. రాధేశ్యామ్ అవ్వగానే నాగ్ అశ్విన్‌తో సెట్స్ మీదకెళతాడనుకున్న ప్రభాస్ ఎక్కువగా బాలీవుడ్ డైరెక్టర్‌తో చెయ్యబోయే ఆదిపురుష్ గురించి ఆలోచిస్తున్నాడనిపిస్తుంది. అందుకే జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో ప్రభాస్ బాడీ ఫిట్ నెస్‌లో బిజీగా ఉన్నాడనే టాక్ వినబడుతుంది. తాజాగా ఆదిపురుష్ దర్శకుడు కూడా ప్రభాస్‌తో ఆదిపురుష్ మేకోవర్ గురించి చెబుతున్నాడు. అంటే ప్రభాస్ రాధేశ్యామ్ కన్నా, నాగ్ అశ్విన్ సినిమా కన్నా ఎక్కువగా ఆదిపురుష్ సినిమా మీదే బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడనిపిస్తుంది. ఓంరౌత్ మాటల్లో ప్రభాస్ ప్రస్తుతం లాంగ్వేజ్ ట్రైనింగ్ నడుస్తున్నట్లు చెబుతున్నాడు.

Advertisement
CJ Advs

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ అతనికి అతనే హిందీలో డబ్బింగ్ చెబుతాడని ఓంరౌత్ చెబుతున్న మాట. అందుకే ప్రభాస్ హిందీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. మరి ఆదిపురుష్ సినిమా కథ పురాణాలకు సంబంధించింది కావడంతో.. హిందీలోనూ ప్రభాస్ పురాణం లాంగ్వేజ్ మాట్లాడడం మాములు విషయం కాదు. అందుకే ప్రభాస్ ముందు హిందీలో పట్టు సాధించడానికి కష్టపడుతున్నాడట. ఇక తర్వాత ప్రభాస్‌కు ఫిజికల్, క్యారెక్టర్ ట్రైనింగ్ మొదలవుతుందని ఓంరౌత్ ఆదిపురుష్‌పై తన స్పందన తెలిపాడు. ఇక ఇది కరోనా టైం కాబట్టి ప్రభాస్‌కి తన పాత్ర గురించి కథ గురించి ఫోన్‌లో వివరిస్తున్నాడట ఓంరౌత్.

కరోనా లాక్ డౌన్ వలన ప్రభాస్‌తో మీటయ్యి చర్చించడానికి లేదని... కాబట్టే ఫోన్ సంభాషణ అని ఓంరౌత్ చెబుతున్నాడు. ఇక లాక్ డౌన్ ముగిసినా కరోనా ఉధృతి తగ్గలేదని.. పరిస్థితులు అనుకూలించాక ప్రభాస్‌ని నేరుగా కలిసి చర్చిస్తామని చెబుతున్నాడు ఓంరౌత్. మరి దర్శకుడు ఓంరౌత్ మాటలను బట్టి ప్రభాస్ ఆదిపురుష్‌పై బాగా గురి పెట్టినట్టుగా కనబడుతుంది. అందుకే మిగతా సినిమాలను లైట్ తీసుకుని ఆదిపురుష్ కోసం రెడీ అవుతున్నాడు.

Prabhas Eye on Om Raut Aadipurush:

Prabhas learned hindi language for Aadipurush
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs