Advertisement
Google Ads BL

సారీ కాదు.. రకుల్‌కి సమంత చేసేది సపోర్టే!


గత రెండు రోజులుగా బాలీవుడ్ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ని చుట్టూ ముట్టింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి టాలీవుడ్ హీరోయిన్ రకుల్ పేరు ఎన్‌సీబీ ఎదుట బయటపెట్టింది అని, అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ సారా అలీ ఖాన్ పేరు కూడా ఈ డ్రగ్స్ కేసులో బయటికి వచ్చింది అని ప్రముఖ టైమ్స్ నౌ ఛానల్ లో ప్రసారమవగా.. రకుల్ ప్రీత్ పై అందరిలో ఆనుమానాలు మొదలవడమే కాదు... టాలీవుడ్ మీడియా ఏకంగా రకుల్ ఇంటిని చుట్టముట్టడం, ఆమె షూటింగ్ చేసుకుంటున్న వికారాబాద్ అడవులకు వెళ్లి హడావిడి చెయ్యడం, రకుల్ మీడియాకి మొహం చాటేసి.. క్రిష్ సినిమా షూటింగ్ నుండి అర్ధాంతరముగా వెళ్ళిపోయింది అనే ప్రచారం మాములుగా జరగలేదు. రకుల్ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె మేనేజర్ చెప్పినా ఎవరూ వినలేదు.

Advertisement
CJ Advs

ఇంకేంటి రకుల్ కి అసలే అవకాశాలు లేవు. ఇక ఈ డ్రగ్స్ కేసులో రకుల్ విచారణ ఎదుర్కొంటే ఆమె కెరీర్ ముగిసినట్టే అనుకున్నారు. అందరూ రకుల్ ప్రీత్ ని డ్రగ్స్ తీసుకున్న హీరోయిన్ గా తప్పుగానే అర్ధం చేసుకున్నారు. అయితే తాజాగా ఈ డ్రగ్స్ కేసుతో రకుల్ ప్రీత్ కి కానీ సారా అలీఖాన్ కి కానీ సంబంధం లేదని ఎన్సీబీ అధికారులు స్పష్టం చేసారు. అసలు ఈ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి రకుల్ పేరు కానీ, సారా అలీ ఖాన్ పేరు కానీ బయటపెట్టలేదని చెప్పడంతో మీడియా అవాక్కయ్యింది. లేదంటే రియా చక్రవర్తి - రకుల్ కలిసున్న ఫొటోస్, వాళ్లిద్దరూ జిమ్ చేస్తున్న, యోగ చేస్తున్న వీడియోస్ తో గత రెండు రోజులుగా టాలీవుడ్‌ మీడియా ఛానల్స్‌లో మార్మోగిపోయాయి.

ఇక ఎన్సీబీ అధికారులు రకుల్ పేరు, సారా పేరు ఈ డ్రగ్స్ కేసులో బయటికి రాలేదని కొట్టిపారెయ్యగానే.. రకుల్‌ని సారాని తప్పుగా అర్ధం చేసుకున్న నెటిజెన్స్ ఒక్కొక్కరిగా రకుల్‌కి, సారాకి క్షమాపణలు చెబుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత ఈ సారీ చెబుతున్న ఇమేజెస్ అన్నింటిని తన ఇన్‌స్టా‌లో పోస్ట్ చేసి రకుల్‌గా సపోర్ట్‌గా నిలిచింది. గత రాత్రి సమంత తన ఇన్స్టా లో రకుల్ ప్రీత్‌కి, సారా అలీ ఖాన్‌కి సారీ చెబుతూ వస్తున్న పోస్ట్‌లను, వారు ఈ డ్రగ్స్ స్కాండిల్‌లో లేరని పోస్ట్‌లను పెడుతూ.. వారిద్దరికి సపోర్ట్‌గా నిలుస్తున్నట్లుగా ఆమె పోస్ట్‌లు చేసింది. అయితే దీనిని కొందరు సమంత కూడా రకుల్‌ని తప్పుగా అర్ధం చేసుకుందని.. తప్పుగా అనుకున్నందుకు నెటిజెన్స్ సారి చెప్పినట్లే.. ఆమె కూడా సారీ చెప్పిందని రాస్తుండటం విశేషం. ఇక్కడ సమంత సారీ చెప్పలేదు.. ఎందుకంటే మొదటి నుంచి రకుల్‌కి సమంత సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడామెను అర్థం చేసుకుని సారీ చెబుతున్న పోస్ట్‌లను మాత్రమే సమంత పోస్ట్ చేసి మరోసారి తన సపోర్ట్‌ని తెలియజేసింది.

Samantha supports heroine Rakul Preet Singh:

Samantha didn’t say sorry to Rakul preet singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs