Advertisement
Google Ads BL

పవన్, క్రిష్ ఫిల్మ్ ప్లానింగ్ మారుతోందా?


పవన్ కళ్యాణ్ హీరోలందరికీ  షాకిస్తూ వరసగా సినిమాలు లైన్‌లో పెట్టిన విధానం చూస్తే పవన్ స్పీడు తట్టుకోవడం కష్టమనేలా ఉంది. అసలు కరోనా రాకపోతే వకీల్ సాబ్ ఫినిష్ చేసి క్రిష్ సినిమాని పవన్ కళ్యాణ్ సగానికి పైగా పూర్తి చేసేవాడు. తర్వాత హరీష్ శంకర్‌తో మూవీ. కొత్తగా లైన్‌లోకి సురేందర్‌రెడ్డి మూవీ చెయ్యాలి పవన్ కళ్యాణ్. అయితే క్రిష్‌తో పవన్ కళ్యాణ్ జానపద చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు.. ఈ కథ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉందనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక హరీష్ శంకర్‌తో చెయ్యబోయే సినిమా సినీ రాజకీయ నేపథ్యంలో ఉండబోతుంది అనే టాక్ ఉంది. ఇక కరోనా ఉన్నా మెల్లిగా షూటింగ్స్ మొదలవడంతో పవన్ కూడా వచ్చే నెల నుండి వకీల్ సాబ్ షూట్‌లో పాల్గొననున్నాడనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

తర్వాత క్రిష్ సినిమా చేస్తాడట పవన్. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో క్రిష్ - పవన్ కాంబోపై విపరీతమైన అంచనాలున్నాయి. పవన్ ఒప్పుకున్నా సినిమాల్లోకెల్లా భారీ చిత్రం క్రిష్‌దే అంటున్నారు. బడ్జెట్ పరంగాను క్రిష్ సినిమాకే బాగా పెట్టుబడి పెట్టాలట. ఇక క్రిష్ - పవన్ కళ్యాణ్ సినిమా పాన్ ఇండియాగా మారినా మారొచ్చని.. ఒకవేళ పాన్ ఇండియా లెవల్లో కాకపోయినా బాలీవుడ్‌లో కూడా క్రిష్ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చూస్తాడని, క్రిష్‌కి ఇప్పటికే బాలీవుడ్‌లో క్రేజ్ ఉంది. దాన్ని వాడుకోవచ్చని అంటున్నారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పవన్ - క్రిష్ మూవీ ఉంటుంది అని అంటున్నారు. సినిమా మొదలయ్యాక కొన్నాళ్ళకి ఈ సినిమా ఎన్ని భాషల్లో తెరకెక్కుతుందో చెబుతారని.. అందుకే హీరోయిన్ విషయంలోనూ క్రిష్ బాలీవుడ్ భామ కోసమే పట్టుబడుతున్నాడని అంటున్నారు.

Pawan and Krish combo film turns Pan India film:

Pawan Kalyan and Krish film Planning changed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs