Advertisement
Google Ads BL

ఓటీటీలో వద్దనుకుంటే ఈ మూవీస్ పరిస్థితేంటి?


ప్రస్తుతం షూటింగ్స్ పూర్తయ్యి.. విడుదల కోసం వేచి చూస్తూన్న సినిమాలన్నీ వరసగా ఓటిటి దారి పడుతున్నాయి. నిన్నగాక మొన్న నాని వి సినిమాని అమెజాన్ ప్రైమ్ కొనేసి విడుదల చెయ్యగా.. ఇప్పుడు రాజ్ తరుణ్ ఒరేజ్ బుజ్జిగాని ఆహా కొనేసి అక్టోబర్ 2న విడుదలకు ఏర్పాట్లు చేస్తుంది. ఇక నిశ్శబ్దం ఓటిటి అగ్రిమెంట్ హోల్డ్ లో ఉన్నట్లుగా టాక్ అయితే ఉంది. అయితే షూటింగ్స్ పూర్తయ్యి విడుదలకు వేచి చూసిన సినిమాలు ఓటిటికి పోతున్నాయి. మరి తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌కి వెళ్లే సినిమాల పరిస్థితి ఏమిటి?

Advertisement
CJ Advs

నిన్నగాక మొన్న నితిన్ రంగ్ దే షూటింగ్, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు, కీర్తి సురేష్ మిస్ ఇండియా, చైతూ లవ్ స్టోరీ ఇలా మీడియం బడ్జెట్ సినిమాల షూటింగ్ మొదలైంది. అందులో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు షూటింగ్ పూర్తయ్యింది. ఇక రంగ్ దే, లవ్ స్టోరీ షూటింగ్స్ జరుగుతున్నాయి. మరి చాలా తక్కువ రోజుల్లోనే చిత్రీకరణలు పూర్తి చేసుకుంటున్న సినిమాలు థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకు వేచి చూస్తాయా? లేదంటే ఓటిటి బాట పడతాయా అంటే.. ఇప్పటికే రంగ్ దే టీం మేం సంక్రాంతి వరకు ఆగమన్నా ఆగుతాం కానీ ఓటిటికి వెళ్లే ప్రసక్తి లేదని ప్రకటించాయి. 

ఇక సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు, చైతూ లవ్ స్టోరీలు ఏ విషయమూ తేల్చడం లేదు. ఇక కీర్తి సురేష్ మిస్ ఇండియా కూడా అమెజాన్ డీల్ కుదిరేలా ఉంది అంటున్నారు. థియేటర్స్ తెరుచుకోవడానికి అనుమతులు కూడా వస్తున్న తరుణంలో.. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తయ్యే సినిమాల ఆలోచన ఎలా ఉంటుందో అనేది క్లారిటీ రావడం లేదు.

Heroes not interested on OTT Release:

Sai Dharam Tej, Naga Chaitanya, Nithiin and Keerthi Suresh Movies Shooting completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs