తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 నుండి 3 వరకు కాస్త క్రేజ్ తెచ్చుకున్నవే. కాస్త ఎరిగున్న మొహాలతో మూడు సీజన్‌లు బుల్లితెర ప్రేక్షకులని బాగానే ఎంటర్‌టైన్ చేసాయి. కానీ నాలుగో సీజన్ వచ్చేసరికి అసలు ప్రేక్షకులకి తెలియని మొహాలని హౌస్‌లోకి పంపి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టి షోని రక్తి కట్టించాలని బిగ్ బాస్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ షో మొదలైనప్పటినుండి బిగ్ బాస్ మీద బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో మీద మరో న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అదేమంటే బిగ్ బాస్ సీజన్స్ 1,2,3 లు ఈటివిలో గురు శుక్రవారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్‌లను పోటాపోటీగా ఎదుర్కొన్నాయి.
కానీ సీజన్ 4 గురు, శుక్రవారాల్లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్‌ని కొట్టడం అంత ఈజీ కాదంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4కి నిజంగా అంత సీన్ ఉందా అని చాలా మంది నెటిజన్లు డౌట్. గత ఎనిమిదేళ్లుగా బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో పాతుకుపోయింది జబర్దస్త్. అందులోను లాక్ డౌన్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో కమెడియన్స్ స్కిట్స్ చేస్తూ నవ్విస్తున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 4 మొత్తం బిగ్ బాస్ రాసిచ్చిన స్కిట్ ప్రకారమే నడుస్తుంది అనే వాళ్ళు ఎక్కువయ్యారు. అందరూ బిగ్ బాస్‌లో ఫెయిర్‌గా ఉండకుండా ఎవరికి వారే బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నారనిపిస్తుంది. ఇలాంటి టైంలో బిగ్ బాస్ జబర్దస్త్‌ని కొట్టి టీఆర్పీ క్రాస్ చెయ్యడమనేది జరగదని.. రాబోయే రోజుల్లో ఏమైనా బిగ్ బాస్ షో రక్తి కట్టి జబర్దస్త్ షోని క్రాస్ చేస్తుందేమో చూడాలి అని అంటున్నారు.