Advertisement
Google Ads BL

పాపం.. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకి ఎన్ని కష్టాలో..?


కరోనా కారణంగా భారీ బడ్జెట్ నిర్మాతలంతా అడ్డంగా బుక్కయ్యారు. షూటింగ్స్ వాయిదా పడడంతో... సినిమాలకు పెట్టిన ఖర్చుకి వడ్డీలు కట్టలేక నానా అగచాట్లు పడుతున్నారు. అయితే కరోనా ఉదృతి ఎలా ఉన్న ప్రస్తుతం చాలామంది హీరోలు షూటింగ్స్ కోసం ధైర్యంగా సెట్స్ మీదకెళుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా RRR షూటింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాడని.. దసరా తర్వాత RRR షూటింగ్ మొదలవబోతుంది అని ఫిలింనగర్ న్యూస్. అయితే తాజాగా RRR సినిమా వలన, కరోనా వలన నిర్మాత దానయ్య అగచాట్లు దేవుడికెరుక అంటున్నారు. కరోనా సోకి కాస్త సిక్ అయిన దానయ్యకి ఇప్పుడు RRR షూటింగ్ మొదలైనా సంతోషం లేకుండా పోయేలా ఉందంటున్నారు.

Advertisement
CJ Advs

ఎందుకంటే RRR సినిమా కోసం కరోనాకి ముందే భారీ సెట్స్ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ మొదలైనా RRR తదుపరి షెడ్యూల్ అదే సెట్స్‌లో షూట్ మొదలుపెట్టాలి. అయితే ఆరు నెలల క్రితమే షూటింగ్ నిలిచిపోవడంతో RRR కోసం వేసిన భారీ సెట్స్ ఇప్పుడు పాడైపోయాయని అంటున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో 20 కోట్లతో నిర్మించిన భారీ సెట్ ఇప్పుడు పాడైంది అని అంటున్నారు. ఎలాగైనా ఆ సెట్‌ని రీ మోడలింగ్ చేసి అందులోనే షూటింగ్ మొదలు పెట్టాలని RRR టీం భావిస్తోందట. మళ్ళీ దానికి అదనపు ఖర్చు అవడంతో దానయ్య ఇప్పుడు బెంగ పడుతున్నాడని ఫిలింసర్కిల్స్‌లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

RRR Producer Danayya Faces Problems:

Remodeling to RRR Sets.. Danayya in worry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs