Advertisement
Google Ads BL

ప్రియదర్శికి ‘ఛీ’ అనిపించిన సందర్భమిదే!


పెళ్లి చూపులు సినిమాలో నా చావు నేను చస్తా అంటూ అందరిని నవ్వులతో ముంచి లేపిన ప్రియదర్శి తర్వాత హీరోలకి ఫ్రెండ్ కేరెక్టర్స్ తోనే కాదు.. మల్లేశం సినిమాతో హీరోగానూ అదరగొట్టేసాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా నటిస్తున్న ప్రియదర్శిని అలీతో సరదాగా కార్యక్రమంలో అలీ ఇంటర్వ్యూ చేసాడు. అందులో ప్రియదర్శి చాలా విషయాలను పంచుకున్నాడు. తరుణ్ భాస్కర్ తనకి స్నేహితుడని, రాహుల్ రామకృష్ణ కూడా చాలామంది స్నేహితుడని చెప్పిన ప్రియదర్శిని అలీ, విజయ్ దేవరకొండ ఎలా ఉంటాడు అని అడగ్గానే.. సినిమాల్లో, స్టేజ్ పైన ఎక్కువగా మాట్లాడే విజయ్ దేవరకొండ బయట ఎక్కువగా అంటే పెద్దగా మాట్లాడని చెప్పాడు.

Advertisement
CJ Advs

ఇక మీ జీవితంలో వరెస్ట్ అయిన సందర్భం అంటే ఛీ అనే సందర్భం ఏమైనా ఉందా అంటే.. ఉంది అది ఏమిటంటే ఒకరోజు ఓ ఫోన్ వచ్చింది. అది మీరు సిటీ సెంటర్ లో షాపింగ్ చేసారు మీరు 28 వేలు గెలుచుకున్నారు.. పట్టుకెళ్ళండి అంటే కొద్దిగా అనుమానం వచ్చినా ఎందుకైనా మంచిదని చందానగర్ లో ఉన్న నేను మా ఫ్యామిలీని వెంటేసుకుని క్యాబ్ లో గిఫ్ట్ ఇస్తా అన్న క్లబ్బుకి వెళ్లగా అక్కడ వారు మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు.. మీరు వెకేషన్‌కి వెళితే ఈ కూపన్స్ వాడుకోవచ్చు అని చెప్పేసరికి నాకు బాగా ఒళ్ళు మండింది. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఛీ అనిపిస్తుంది అని చెప్పాడు ప్రియదర్శి.

ఇక కరోనా లాక్ డౌన్ లో నేను క్లీనింగ్ చేస్తే నా వైఫ్ వంట చేసేది అని చెప్పిన ప్రియదర్శి.. మహేష్ తో స్పైడర్ చేసారు, ఇప్పుడు ప్రభాస్‌తో రాధేశ్యామ్ చేస్తున్నారు ఎలా అనిపించింది అని అడిగితే.. దానికి మహేష్ బాబు చాలా ప్రొఫెషనల్. ఇక ప్రభాస్‌తో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. లాక్ డౌన్ ముందు జార్జియాలో రాధేశ్యామ్ షూటింగ్ చేసాం. మేము జార్జియా నుండి వచ్చిన రెండు రోజులకి జనతా కర్ఫ్యూ పెట్టారని చెబుతున్నాడు ప్రియదర్శి.

Priyadarshi alitho saradaga episode highlights:

priyadarshi revealed series incident in his life at alitho saradaga
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs