Advertisement
Google Ads BL

‘ఆదిపురుష్’ హీరోయిన్‌పై అవన్నీ రూమర్సే!


బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేయడమే మొదలు ఆ సినిమాపై రకరకాల న్యూస్‌లు ప్రచారంలోకొస్తున్నాయి. అయితే ఆదిపురుష్ ప్రకటన తర్వాత ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్‌తో ధీటుగా నిలబడే విలన్ సైఫ్ అలీ ఖాన్ అని ప్రచారం జరుగుతుండగా.. ఓం రౌత్ ఆదిపురుష్ టీం.. తమ సినిమాలో విలన్ పాత్రకి సైఫ్ అలీ ఖాన్ ఫిక్స్ అంటూ అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన సీతగా సౌత్ భామ కీర్తి సురేష్ అని కాదు.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ అంటూ ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా కీర్తి సురేష్, కియారాలు కాదు.. ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతుల్లా పేరు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. బాలీవుడ్ బోల్డ్ భామ ఊర్వశి ప్రభాస్ ఆదిపురుష్ సీతగా ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్న వేళ ఆదిపురుష్ టీం లైన్ లోకొచ్చి మేము ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ కి జోడిగా ఇంకా హీరోయిన్ ని ఎంపిక చెయ్యలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న పేర్లతో మాకు సంబంధం లేదు.. కేవలం అవన్నీ పుకార్లే అని కొట్టిపారెయ్యడమే కాదు.. హీరోయిన్ ఎంపిక జరిగాక స్వయంగా మేమే అధికారికంగా ప్రకటిస్తామని చెబుతున్నారు.

Aadipurush team condemned the rumors about Heroine:

Aadipurush team reacted on Rumors about Movie Heroine 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs