Advertisement
Google Ads BL

2 సినిమాలు తీశాడు.. రెండు కార్లు కొట్టేశాడు


వెంకీ కుడుముల సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్స్. ‘ఛలో’తో డైరెక్టర్‌గా మారిన వెంకీ కుడుముల ఆ సినిమాతో హిట్ కొట్టాడు. అప్పటివరకు ప్లాప్స్‌లో కొట్టు మిట్టాడిన హీరో నాగశౌర్యకు ‘ఛలో’ రూపంలో హిట్ ఇవ్వడంతో దర్శకుడు వెంకీ కుడుములకి ఓ కార్ ప్రెజంట్ చేశాడు. తర్వాత ఛలో కథ నాదే.. వెంకీకి అంత సీన్ లేదు.. మేమిచ్చిన కార్ కూడా వాడడం లేదంటూ నాగశౌర్య వెంకీ మీద ఫైర్ అయినా.. వెంకీ కుడుముల మాత్రం ఆ వ్యవహారంపై డీసెంట్‌గా వ్యవహరించాడు. ఇక తాజాగా మరో ప్లాప్ హీరో నితిన్‌కి భీష్మ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్‌ని అందించాడు వెంకీ.

Advertisement
CJ Advs

భీష్మ కన్నా ముందు నితిన్ వరసగా హ్యాట్రిక్ ప్లాప్స్‌తో ఉన్నాడు. వెంకీ కుడుములతో చేసిన ‘భీష్మ’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. భారీ కలెక్షన్స్ వచ్చాయి. దానితో నితిన్ ఫుల్ ఖుష్. ప్లాప్‌ల నుంచి వెంకీ తనని బయటపడేశాడు. అందుకే తాజాగా వెంకీ కుడుముల పుట్టిన రోజు నాడు నితిన్ తనకి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి వెంకీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా రేంజ్ రోవర్ కారు. కాస్ట్లీ రేంజ్ రోవర్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంతో వెంకీ కుడుముల ఆనందం వ్యక్తం చెయ్యడమే కాదు.. నితిన్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ ఫోటోను వెంకీ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. మరి రెండే రెండు సినిమాలు డైరెక్ట్ చేసి రెండు కార్లు గిఫ్ట్‌గా కొట్టేశాడు వెంకీ అంటూ సోషల్ మీడియా అంతే ఒకటే టాక్.

2 Cars with 2 Movies to Director Venky Kudumula:

Nithiin Gifted range rover Car to Bheeshma Director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs