దిల్ రాజు వి సినిమాని ఎలాగైనా థియేటర్స్‌లోనే విడుదల చెయ్యాలని కూర్చుని కూర్చుని చివరికి వి సినిమాని మంచి రేటు వచ్చింది కదా అని నానిని, సుధీర్ బాబుని ఒప్పించి అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మేశాడు. వి సినిమా కంటెంట్‌లో కాస్త వీక్‌గా వుండడంతో వి ని అమ్మి దిల్ రాజు ఎలాగో క్యాష్ చేసుకున్నాడని అన్నారు. వి ని థియేటర్స్ కోసం వేచి చూడకుండా ఓటిటికి అమ్మేసి చేతులు దులుపుకోకపోతే థియేటర్స్‌లో కలెక్షన్స్ వచ్చేవి కాదని సోషల్ మీడియాలో విపరీతంగా టాక్ వినిపించింది. అయితే తాజాగా వి ని అమెజాన్‌కి అమ్మేసిన దిల్ రాజు, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌ని అమ్మగలడా? అంటూ ఓ ప్రశ్న సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీని క్యాష్ చేసుకోవాలని బాలీవుడ్ రీమేక్‌ని పవన్‌తో చేయించిన దిల్ రాజు.. ఆ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. కరోనా రాకపోతే వకీల్ సాబ్ ఎప్పుడో విడుదలయ్యేది. కానీ కరోనా వలన ఓ 20 రోజుల షూటింగ్ పెండింగ్ పడింది. అయితే ఆ 20 రోజుల షూటింగ్ అయ్యాక థియేటర్స్ బంద్ ఇలానే నడిస్తే దిల్ రాజు వకీల్ సాబ్‌ని ఓటిటికి అమ్మేస్తాడా అంటున్నారు. మరి వి ని అమ్మేశాడు. అలాగే వకీల్ సాబ్ కూడా అమ్మగలడా? పవన్ క్రేజ్ ఓటిటికి ఎక్కువ అందుకే.. థియేటర్స్‌లో వకీల్ సాబ్ విడుదల చేసి పవన్ క్రేజ్‌ని దిల్ రాజు క్యాష్ చేసుకుంటాడు.
ఒకవేళ థియేటర్స్ బంద్ ఇంకా నడుస్తున్నా.. వకీల్ సాబ్‌కి 50 నుండి 80 కోట్ల ఆఫర్ ఇచ్చినా వకీల్ సాబ్‌ని అలానే ఉంచేస్తాడు కానీ ఎట్టిపరిస్థితుల్లో వకీల్ సాబ్‌ని దిల్ రాజు ఓటిటికి అమ్మడంటున్నారు. పవన్ సినిమా అంటే వెండితెర మీదే చూడాలి కానీ.. ఓటిటిలో చూడడమేమిటి అంటున్నారు. నిజంగానే దిల్ రాజు ఓటిటి నుండి వకీల్ సాబ్‌కి కళ్ళు చెదిరే ఆఫర్ వచ్చినా అమ్మడని అనిపిస్తుంది.