Advertisement
Google Ads BL

హీరోలేమో గానీ.. హీరోయిన్స్ మాత్రం రెడీ!


కరోనా కష్టకాలంలో ఇంటికే పరిమితమైన హీరోయిన్స్ రకరకాల వ్యాపకాలతో లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేశారు. మాములుగా హీరోయిన్స్‌కి అస్సలు తీరిక సమయమే ఉండదు. కారణం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంటే... ఆయా సినిమా షూటింగ్స్‌లో పాల్గొనటానికి ఎప్పటికప్పుడు బిజీ షెడ్యూల్స్‌తో హైరానా పడుతుంటారు. అలాంటి వాళ్ళకి కరోనా లాక్ డౌన్ ఫ్యామిలీతో గడిపే సమయాన్ని అందించింది. ఇక ఈ టైంలోనే వంటల మీద.. జిమ్ మీద, పెయింటింగ్స్ మీద కూర్చున్న హీరోయిన్‌లలో సాయి పల్లవి అయితే ఇండియాలో డాక్టర్ ప్రాక్టీస్ కోసం ఎంట్రెన్స్ రాసింది. ఇక తాజాగా కరోనాకి భయపడేది లేదంటూ షూటింగ్స్ కోసం ఫ్లైట్ ఎక్కేస్తున్నారు హీరోయిన్స్. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్, క్రిష్ - వైష్ణవ తేజ్ సినిమా కోసం వికారాబాద్ ఫారెస్ట్‌కి వెళ్లడమే కాదు.. సరదాగా రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ కూడా చేసేస్తుంది.

Advertisement
CJ Advs

ఇక కీర్తి సురేష్ కూడా గుడ్ లక్ సఖి షూట్ కోసం హైదరాబాద్‌లో వాలింది. రష్మిక కూడా హైదరాబాద్‌కి మకాం మార్చేసింది. ఇక నభా నటేష్ అయితే సోలో బ్రతుకే సో బెటరు కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళింది. ఇక నాగార్జున వైల్డ్ డాగ్ కోసం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ కోసం బాలీవుడ్ భామలు దియా మీర్జా, షియామి ఖేర్ లు దిగిపోగా.. పాయల్ రాజపుత్ తన తదుపరి సినిమా షూట్ కోసం వచ్చేసింది. సాయి పల్లవి, నాగ చైతన్య లవ్ స్టోరీ కోసం హైదరాబాద్‌కి వచ్చేసింది. ఇక టాప్ హీరోయిన్ పూజాహెగ్డే రాధేశ్యామ్ షూటింగ్ కోసం వచ్చే వారం హైదరాబాద్‌కి రాబోతుంది. ఇక శృతి హాసన్ అయితే క్రాక్ షూటింగ్ కోసం ఎప్పుడో హైదరాబాద్‌లో వాలింది. మరి హీరోలే కరోనాకి భయపడుతుంటే.. హీరోయిన్స్ మాత్రం కరోనాని లెక్కచెయ్యకుండా సినిమా షూటింగ్స్ సెట్స్ లో సందడి చేసేస్తున్నారు. అందుకే మీరు గ్రేటమ్మ అన్నది.

Praises on Heroines in tollywood:

Heroines ready to Shooting in tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs