Advertisement
Google Ads BL

మహేష్, ఎన్టీఆర్‌లో చప్పుడు లేదేంటి?


కరోనా కారణంగా షూటింగ్స్ అన్ని బంద్ అయ్యి.. ఐదునెలల తర్వాత మళ్ళీ మెల్లగా షూటింగ్స్ అన్ని మొదలవుతున్నాయి. స్టార్ హీరోలు కూడా సెట్స్ మీదకెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్‌తో, నాగార్జున వైల్డ్ డాగ్‌తో, నాగ చైతన్య లవ్ స్టోరీతో, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు అంటుంటే.. బాలయ్య కూడా బోయపాటి సినిమాతో సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా ఆచార్య షూట్‌లో పాల్గొనబోతున్నాడనే టాక్ ఉండగా.. RRR సినిమా షూటింగ్ గురించి కానీ, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ గురించిన న్యూస్ సోషల్ మీడియాలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. కనీసం బయటికి కనిపించకుండా ఐదారు నెలలుగా సీక్రెట్ మెయింటింగ్ చేస్తున్న ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలెడతాడో అనేది కనీసం గాసిప్ న్యూస్ కూడా లేదు.

Advertisement
CJ Advs

మరోపక్క మహేష్ కూడా సర్కారు వారి పాట షూటింగ్ ఎప్పుడు మొదలెడతాడో క్లారిటీ లేదు. పరశురామ్ అండ్ టీం షూటింగ్ కోసం రెడీగా కాచుకుని కూర్చున్నారు. కానీ మహేష్ మాత్రం ముందుకు రావడం లేదు. కరోనాకి మరీ ఇంతగా భయపడేలా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి. మీకన్నా పెద్ద వాళ్ళు సినిమా షూటింగ్స్ కోసం రెడీ అయితే మీకేమైంది సామి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ కొట్టేసుకుంటున్నారు. మహేష్ బాబు సర్కారు వారి పాట, ఎన్టీఆర్ RRR ఫ్యాన్స్ మా స్టార్ హీరోలకి కరోనా అంటే ఇంత భయమా అంటున్నారు. చరణ్, ప్రభాస్, నాగ్, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ లు షూటింగ్స్‌తో సెట్స్ మీదకెళ్ళిపోతున్నారు. కానీ మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటోళ్ళు మాత్రం ఇంకా ఇంటికే పరిమితమయ్యారు. మరి వీళ్లెప్పుడు సెట్స్ మీదకెళ్తారో చూడాలి. అల్లు అర్జున్ అంటే పుష్ప సినిమాటోగ్రాఫర్ ప్రాబ్లమ్ ఉంది. కానీ ఎన్టీఆర్ - మహేష్‌లకు ఏమైంది. కేవలం కరోనా కారణమా? లేదా మరేదన్నానా? అనే అనుమానం ఫ్యాన్స్‌‌లో మొదలయ్యింది.

Mahesh Babu and Jr NTR Silent on Movie Shootings :

Mahesh and NTR not ready to Shootings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs