Advertisement

చరణ్‌ సరసన ఆ హీరోయిన్‌ ఫిక్సా?


కరోనా లాక్ డౌన్ ముగిసి అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యింది. కేంద్రం కూడా సినిమా షూటింగ్స్ కి అనుమతులివ్వడంతో హీరో, హీరోయిన్స్ ఒక్కొక్కరిగా సినిమా సెట్స్ మీదకెళుతున్నారు. ఇప్పటికే హీరోల్లో చాలామంది సెట్స్ మీదకెళ్ళిపోయారు. తాజాగా హీరోయిన్స్ కూడా సినిమా షూటింగ్స్ కోసం ఫ్లైట్ ఎక్కేసారు. రకుల్ అయితే ఏకంగా క్రిష్ సినిమా షూటింగ్ కోసం వికారాబాద్ అడవులకి వెళ్ళిపోయింది. ఇక రష్మిక కూడా ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానికో హైదరాబాద్ వచ్చేసింది. అంటే రష్మిక, అల్లు అర్జున్ తో నటించబోయే పుష్ప సినిమా షూటింగ్ కోసం వచ్చింది అనుకోవడానికి... పుష్ప షూటింగ్ ఇప్పట్లో కాదనే టాక్ వినబడుతుంది. మరి రష్మిక ఏ షూటింగ్ కోసం దిగిందో అనుకుంటున్నారు.

Advertisement

అయితే రష్మిక ఆచార్యలో రామ్ చరణ్ సరసన నటిస్తుంది అనే టాక్ వినబడింది. రామ్ చరణ్ ఆచార్యలో 30 నిమిషాలు ఓ కీ రోల్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్‌కి ఓ సాంగ్ అలాగే మంచి యాక్షన్ సన్నివేశం, ఓ హీరోయిన్ కూడా ఉండబోతుంది అంటూ కొరటాల ఎప్పుడో రివీల్ చేసేసాడు. అందులో భాగంగానే రామ్ చరణ్ కేరెక్టర్‌కి రష్మికని హీరోయిన్‌గా ఎంపిక చేసారని అన్నారు.. కానీ ప్రకటన ఇవ్వలేదు. అయితే తాజాగా రామ్ చరణ్‌తో రష్మిక ఆచార్యలో నటించబోతుంది అని.. త్వరలోనే మొదలు కావాల్సిన ఈ షూటింగ్‌లో రష్మిక పాల్గొనబోతుంది అని అందుకే హైదరాబాదులో రష్మిక వాలింది అంటున్నారు. మరి రామ్ చరణ్ కూడా RRR ఇప్పట్లో పట్టాలెక్కదు కాబట్టే ఆచార్య షూటింగ్ కోసం దిగబోతున్నాడనే టాక్ ఉంది. 

Acharya: Heroine Fixed for Ram charan:

Rashmika for Ram charan in Acharya Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement