Advertisement

కంగనా సినిమాని రిజెక్ట్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్..


గత కొన్ని రోజులుగా కంగనా రనౌత్ వార్తల్లో ఉంటూ వస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగనా, బాలీవుడ్ బడా సెలెబ్రిటీలని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనాపై కూడా విమర్శలు వెల్లువెత్తిన మాట వాస్తవం. సుశాంత్ మరణం విషయంలోనే కాదు బాలీవుడ్ హీరోయిన్ల పైన మాఫియా ప్రభావం ఉందంటూ తాప్సీ పన్ను, స్వర భాస్కర్ లపై కామెంట్లు చేసింది.

Advertisement

ఐతే ఈ కామెంట్లకి కౌంటర్ కామెంట్లు పడ్డాయి. బాలీవుడ్ సెలెబ్రిటీలపై కంగనా చేసిన వ్యాఖ్యలు ఆమె సినిమాలపై ప్రభావాన్ని చూపిస్తాయని వినిపించాయి. ఐతే అది నిజమే అని అనిపిస్తోంది. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్, కంగనా సినిమాని రిజెక్ట్ చేసినట్లు చెప్పాడు. పీసీ శ్రీరామ్ ట్వీట్ ఈ విధంగా ఉంది. కంగనా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమాని రిజెక్ట్ చేసాను. సినిమా ఒప్పుకోవడం తనకిష్టం లేదని చెప్పడంతో మేకర్స్ విషయాన్ని అర్థం చేసుకున్నారట. కొన్ని సార్లు మనసుకి ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యాలని చెప్తూ చిత్ర యూనిట్ కి ఆల్ ద బెస్ట్ తెలిపాడు. 

Click here for Tweet

Cinematographer rejected Kangana movie..:

Cinematographer rejected Kangana movie..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement