Advertisement
Google Ads BL

బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్!!


హీరోయిన్ రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ముంబై లోని ఎన్సీబీ కార్యాలయానికి రియా ఈ ఉదయం విచారణకు హాజరయ్యింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న రియా చక్రవర్తిని నేడు డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు చేసారు. గత పది రోజులుగా.. సిబిఐ, ఈడీ ఎదుట విచారణకు హాజరవుతున్న రియా ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే నేడు రియా చక్రవర్తిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అయితే సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య విషయంలో రియా చక్రవర్తి పార్ట్ ఎంత ఉందొ తెలియదు కానీ... ఆమె సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్చినట్టుగా ఒప్పుకోవడంతో ఆమెని అరెస్ట్ చేసారు. ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ అరెస్ట్ అవగా.. డ్రగ్స్ కేసులో నేడు రియా కూడా అరెస్ట్ అయ్యింది.

Advertisement
CJ Advs

రియా చక్రవర్తి ని సిబిఐ, ఎన్సీబీ, ఈడీ రకరకాల ప్రశ్నల్తో కన్ఫ్యూజ్ చెయ్యగా... ఈ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. రియా చెప్పడంతోనే ఆమె సూచనల మేరకే సుశాంత్ సింగ్ కి డ్రగ్స్ ఇచ్చినట్టు రియా సోదరుడు షోవిక్ ఒప్పుకున్నాడు. ఇక రియా కూడా సుశాంత్ కోసమే ఇదంతా చేసానని చెబుతూనే, సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్చినట్టుగా ఒప్పుకుంది. సుశాంత్ సింగ్ చుట్టూ డ్రగ్స్ బాబులే ఉన్నారని, సుశాంత్ డ్రగ్స్ మత్తులో మునిగితేలేవాడని, సుశాంత్ కోసమే డ్రగ్స్ ఇచ్చానని ఒప్పుకున్నా రియా చక్రవర్తి తాను కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా.. ఎన్సీబీ ఎదుట రియా చెప్పినట్లుగా తెలుస్తుంది. రియా చక్రవర్తి మరో 25  మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ పేర్లను ఈ డ్రగ్స్ కేసులో బయటపెట్టినట్టుగా బాలీవుడ్ మీడియా టాక్. వాళ్లెవరనేది రియా ఎన్సీబీ ఎదుట చెప్పింది అని.. వాళ్ళకి కూడా ఎన్సీబీ నోటీసు లు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రియా వాంగ్మూలంతో రియని అరెస్ట్ చేసినట్లుగా గా తెలుస్తుంది.

Breaking: Rhea Chakraborty Arrested:

Rhea Chakraborty has been arrested by the Narcotics Control Bureau
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs