Advertisement
Google Ads BL

జయప్రకాష్ రెడ్డిపై తెలుగులో ట్వీటేసిన ప్రధాని నరేంద్రమోదీ..


తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన జయప్రకాష్ రెడ్డి గారి మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. నటుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించి, తనదైన యాసలో తెలుగు ప్రేక్షకులని నవ్వించిన జయప్రకాష్ రెడ్డి గారు సడెన్ గా మరణించడం పెద్ద షాకే. ఐతే ఈ విషయమై తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల నుండి మొదలుకుని, అందరూ జయప్రకాష్ గారి మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఐతే ప్రధాని నరేంద్రమోదీ గారు జయప్రకాష్ రెడ్దిగారి మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో తెలుగులో పోస్ట్ పెట్టారు. ప్రధాని మోదీగారు తెలుగులో ట్వీట్ వేయడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ప్రస్తుతం జయప్రకాష్ రెడ్డి గారికి సంతాపాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ట్వీట్ వేసారు. జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో  అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం  సినిమా ప్రపంచానికి తీరని  లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి. అని పోస్ట్ చేసారు.

Click here for Tweet

PM Modi tweet in Telugu..:

PM Modi tweet in Telugu..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs