Advertisement
Google Ads BL

రV రెడ్డి పాత్రకు Vపరీతమైన ప్రశంసలు!


‘ఇన్స్పెక్టర్ ప్రసాద్’ పాత్రకు Vపరీతమైన ప్రశంసలు!! -న్యూ స్టైలిష్ విలన్ రV రెడ్డి

Advertisement
CJ Advs

V చిత్రంలో తను పోషించిన ‘ఇన్స్పెక్టర్ ప్రసాద్’ పాత్రకు విపరీతమైన స్పందన లభిస్తోందని అంటున్నారు అమెరికా రిటర్నెడ్ బిజినెస్ మ్యాన్ టర్నెడ్ విలన్ ‘రవి రెడ్డి’. ‘వి’ చిత్రంలో నాని, సుధీర్ బాబు, నివేదా, అదితి రావ్ పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర... రవి రెడ్డి పోషించిన ‘ఇన్స్పెక్టర్ ప్రసాద్’ పాత్ర. ఇంత కీలక పాత్రకు తనను ఎంపిక చేసి, తన కెరీర్‌ను మలుపు తిప్పిన దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణకి... నిర్మాతలు దిల్ రాజు-శిరీష్-హర్షిత్ రెడ్డికి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని రవి రెడ్డి అంటున్నారు. నాని, సుధీర్ బాబు... ఇద్దరి కాంబినేషన్‌లోనూ కలిసి నటించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెబుతున్నారు.

రవిరెడ్డి ఇంతకు ముందు ‘ఇంటిలిజెంట్, సాఫ్ట్ వేర్ సుధీర్, దర్పణం, డిగ్రీ కాలేజ్’ వంటి చిత్రాలతోపాటు... విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ పరిచయ చిత్రం ‘దొరసాని’లోనూ విలన్ గా మెప్పించి పరిశ్రమవర్గాల దృష్టిని విశేషంగా ఆకర్షించారు.సినిమాపై ప్యాషన్‌తో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేశారు రవిరెడ్డి. అమెరికాలో ఎం.బి.ఏ చేసిన రవిరెడ్డి.. ఫిలిం అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. చూడగానే కట్టి పడేసే స్పురద్రూపానికి.. నటనలో నిష్ణాతుడై ఉండడం, అమెరికాలో మోడలింగ్ చేసి ఉండడం వంటి అంశాలు ఈ ‘కరీంనగర్ ముద్దుబిడ్డ’కు బాగా కలిసి వచ్చాయి. రవిరెడ్డి స్వయంగా ‘ఫిట్‌నెస్ నిపుణుడు’ అయి ఉండడం మరో ముఖ్య విశేషం. రవి రెడ్డి ప్రస్తుతం... రానా దగ్గుబాటి-సాయి పల్లవిలతో వేణు ఊడుగుల రూపొందిస్తున్న ‘విరాటపర్వం’లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు!!

New stylish villain Ravireddy role highlight in V Movie:

Ravi Reddy the stylish new Villain in T town
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs