Advertisement
Google Ads BL

వరుణ్ తేజ్ నెక్స్ట్ చిత్రం.. పోలీస్ డ్రామా..?


మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా షూటింగ్స్ మొదలెడుతున్న సమయంలో వరుణ్ తేజ్ సినిమాని కూడా మొదలెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే ప్రస్తుత ఖాళీ సమయాన్ని తన భవిష్యత్ ప్రాజెక్టులని సెట్ చేసుకోవడానికి వినియోగించుకుంటున్నాడట.

Advertisement
CJ Advs

ఈ మేరకు కొత్త కొత్త కథలు వింటూ సినిమాలని లైన్లో  పెట్టాలని చూస్తున్నాడని టాక్. గతంలో అప్పట్లో ఒకడుండేవాడు దర్శకుడు సాగర్ చంద్రతో వరుణ్ తేజ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

సాగర్ చంద్ర మంచి కథతో వరుణ్ తేజ్ ని ఇంప్రెస్ చేసాడని చెప్పుకుంటున్నారు. పవర్ ఫుల్ పోలీస్ డ్రామాలో పోలీస్ ఆఫీసరుగా వరుణ్ తేజ్ కనిపించనున్నాడట. ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. కంచె సినిమాలో జవాన్ గా కనిపించిన వరుణ్, ఈ సినిమాలో పోలీస్ గా కనిపిస్తాడన్నమాట.

Varun next would be police drama..:

Varun next would be police drama..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs