ఎఫ్ 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకటేష్, ఆ తర్వాత వెంకీమామా ద్వారా డీసెంట్ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప అనే సినిమా చేస్తున్నాడు. ఐతే వెంకీ తన కెరీర్లో 75సినిమాల మైలురాయి చేరుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ 75వ సినిమా గురించి రకరకాల వార్తలు వచ్చాయి. 75వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండనుందని అన్నారు.
త్రివిక్రమ్ కూడా ఇందుకు ఓకే అన్నాడని ప్రచారం జరిగింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో వెం కీ 75వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనుందని గట్టిగా వినబడింది. దీంతో అభిమానులు కూడా చాలా సంతోషించారు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో వెంకీ 75వ చిత్రం ఉంటుందంటే అభిమానులకి అంతకన్నా ఏం కావాలి.
ఐతే తాజాగా అభిమానుల ఆశలపై నీళ్ళు పడ్డాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సూర్యదేవర నాగవంశీ వెంకీ75వ సినిమాపై వస్తున్న పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రకారం వెంకీ 75వ సినిమాపై వస్తున్న వార్తలు నిజం కావనీ. ఏ అధికారిక సమాచారమైనా తమ అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రకటిస్తామని చెప్పారు. దీంతో వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని నమ్మినవారిని నిరాశ పరిచినట్టయింది.