Advertisement
Google Ads BL

సోనూసూద్ కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు బెటర్!


సోనూసూద్ ఈ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా వినిపిస్తున్న విషయం విదితమే. సాయం చేయాలని రెక్వెస్ట్ చేస్తే చాలు గంటల్లోనే తనకు తోచినంత సాయం చేసేస్తున్నాడు. దీంతో సినిమాల్లో విలన్‌గా నటించే ఈయన్ను అభిమానులు, అనుచరులు, సాయం పొందినవాళ్లు ‘రియల్ హీరో’ అని పిలుచుకుంటున్నారు. ఇంకొందరు ‘సూపర్‌ మ్యాన్‌’లా భావిస్తున్నారు. అలా రోజురోజుకూ సోనూ క్రేజ్ పెరిగిపోతోంది. ఇప్పటి వరకూ ఆయన ఎంతమందికి ఎన్నిసార్లు సాయం చేశారో.. ఆయనకే ఎరుక. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మొదలు ఇప్పటికీ ఆయన అక్కడ.. ఇక్కడ అని కాదు దేశ వ్యాప్తంగా.. ఇతర దేశాల్లో ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ ఎవరైనా సరే తనను సాయం అర్జిస్తే కచ్చితంగా చేసి తీరుతున్నాడు. అయితే.. సోనూకంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ లక్ష రెట్లు బెటర్ అని ప్రముఖ రచయిత, నటుడు, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళీ చెప్పుకొచ్చారు. ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
CJ Advs

లక్ష రెట్లు బెటర్..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టకముందే ఇన్‌కమ్ ట్యాక్స్ ఫెయిడ్ ఫ్యామిలీ. నేను 15 రోజులు పులివెందులలో ఉండి, మొత్తం తిరిగి ప్రజలతో మాట్లాడుకుని వచ్చాను (ప్రామిస్‌గా చెబుతున్నా). పులివెందులలోని 10 ఎస్సీ, ఎస్టీ కాలనీలున్నాయ్. వారందరికీ వైఎస్ కుటుంబమే స్థలమిచ్చి, ఇళ్లు కట్టించి మొత్తం చేశారు. మరి ఇవన్నీ ఎవడికి తెలుసు. రాజారెడ్డిగారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు 5 లక్షల కళ్ల ఆపరేషన్లు చేయించారట. ఇప్పటికీ వికలాంగులు, మానసిక వికలాంగులకు వైఎస్ భారతీగారు పొంత డబ్బులతో స్కూల్స్ పెట్టించారు. వారి బాగోగులు మొత్తం జగన్, భారతీ గారే చూసుకుంటున్నారు. ఇవన్నీ ఎవడైనా చెప్పుకుంటారా..?. మీరంటున్నారే (యాంకర్‌ను ఉద్దేశించి) సోనూసూద్ అని.. ఆయన కంటే లక్ష రెట్లు వైఎస్ భారతీగారు బెస్ట్. ఆమె సేవ చేస్తున్నారు.. ఇవన్నీ ఎవరికీ చెప్పరు.. చెప్పుకోరు కూడాఅని పోసాని చెప్పుకొచ్చారు. అయితే పోసాని వ్యాఖ్యలను కొందరు అంగీకరిస్తుండగా.. మరికొందరు మాత్రం ఎందుకిలా పోసాని.. వైఎస్ ఫ్యామిలీ భజన చేస్తున్నారని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

YS Bharathi Is One Lakh Times Better than Sonusood :

YS Bharathi Is One Lakh Times Better than Sonusood   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs