Advertisement
Google Ads BL

ఛానెల్ యాంకర్‌కి చమట్లు పట్టించిన హరీష్!


దర్శకుడు హరీష్ శంకర్‌కి కాస్త కోపమెక్కువే. డీజే సినిమా టైమ్‌లో రివ్యూస్ ఇవ్వని వెబ్ సైట్ ఓనర్లకి ఇప్పటికీ కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు హరీష్. అయితే తాజాగా ఓ ఛానల్ యాంకర్‌కి హరీష్ శంకర్ చమట్లు పట్టించాడు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చెయ్యడం దగ్గరనుండి పవన్ బర్త్ డే రోజున పోస్టర్ హంగామా వరకు చాలా బిజీగానే ఉన్నాడు. అయితే పవన్‌తో హరీష్ సినిమా అనగానే ఆ సినిమాపై పిచ్చ క్రేజ్ వచ్చేసింది. తాజాగా ఓ ఛానల్ హరీష్ శంకర్‌ని ఇంటర్వ్యూ చేసింది. సదరు యాంకర్ హరీష్ శంకర్‌ని బోలెడన్ని ప్రశ్నలు అడగడమే కాదు.. పవన్ కళ్యాణ్‌తో సినిమాపై ఆయన రాజకీయాలపై ప్రశ్నలు వేశాడు.

Advertisement
CJ Advs

అందులో భాగంగానే.. పవన్ కళ్యాణ్‌తో మీరు చేయబోయే సినిమా ఎలా ఉంటుంది అంటే.. అందరికి నచ్చేలా.... మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగించేలా ఉండబోతుంది అని చెప్పడమే కాదు పవర్ స్టార్‌తో ఈసారి బొమ్మ దద్దరిల్లిపోవడమే అని చెప్పాడు. ఇక సదరు యాంకర్ కాస్త ఉత్సాహం‌గా పవన్ తో సినిమా చేస్తున్నారు కదా.. పవన్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు దానికి మీ స్పందన ఏమిటి అని అడగ్గానే మండిన హరీష్ శంకర్ మీరు వృథాప్రయాసతో ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. సినిమా దర్శకుడిని సినిమాల గురించి అడగాలి.. రాజకీయాల గురించి కాదు.. నేనేమైనా రాజకీయ నాయకుడినా? లేదా మీ చానెల్ ఎండీనా? మీరు వేసే ప్రశ్న ఏమిటి? నేను ఎందుకు సమాధానం చెప్పాలంటూ యాంకర్‌కి దిమ్మతిరిగే సమాధానం చెప్పి చమట్లు పట్టించాడు.

Harish Shankar Serious on Channel Anchor:

Harish Firing Answer to Channel Anchor question
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs