Advertisement
Google Ads BL

నాని అందుకే ‘వి’ చిత్రంలో చేశాడా?


ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వి’ సినిమా తాజాగా ఓటిటి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. మిక్స్డ్ టాక్‌తో సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఐదారునెలలుగా థియేటర్స్ మూత పడడంతో పాటు సరైన సినిమాలేక ప్రేక్షకులంతా చిరాకుగా ఉన్న టైం లో ‘వి’ సినిమా విడుదల కావడంతో కాస్త కంటెంట్ రొటీన్‌గా అనిపించినా ప్రేక్షకులు మాత్రం వి సినిమా కోసం ఎగబడ్డారు. అయితే ఈ సినిమాకి వి టీం చేసిన ప్రమోషన్స్ కూడా సినిమాపై క్రేజ్‌కి ఒక కారణం. నాని, నివేత థామస్, సుధీర్ బాబు అందరూ ‘వి’ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. అందుకే ప్రమోషన్స్‌లో టాప్ అయినందువలనే కంటెంట్ వీక్ అయినా వి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే వి సినిమా కథని ముందు ఇంద్రగంటి - దిల్ రాజు ముందుగా బన్నీకి వినిపించగా రొటీన్ రివెంజ్ డ్రామా అని చెప్పి రిజెక్ట్ చెయ్యడంతో.. సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లగా ఆల్రెడీ నేను జవాన్ మూవీ ఇలాంటి కథతోనే చేశాను. మళ్లీ అంటే సెట్ కాదనేశాడట. తర్వాత అష్టాచెమ్మా, జంటిల్మన్ సినిమాలు చేసిన నానికి హీరో సుధీర్ బాబుకి కథ వినిపించగా నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి అనుకుని ఈ సినిమాని ఒప్పుకున్నాడట. అందులోను సుధీర్ బాబు కన్నా ఒకింత నాని పాత్రే హైలెట్ అవడంతో అన్ని వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాడట. ఇక సుధీర్ బాబు సమ్మోహనం ఇంద్రగంటితో చేసి ఉండడం.. అందులోను వి లోని పవర్ పాత్రలాంటి పాత్ర మరే సినిమాలోనూ చేయకపోవడంతో ఈ సినిమా ఒప్పేసుకుని ఉండవచ్చు. సో చివరికి నాని - సుధీర్ బాబులు కలిసి ‘వి’ చేశారన్నమాట.

Nani negative role in Indraganti V Movie:

Nani Accepeted V Movie for That reason
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs