Advertisement
Google Ads BL

‘పుష్ప’లో విజయ్ సేతుపతి రోల్‌లో ఎవరు?


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా షూటింగ్ వచ్చే నవంబర్ నుండి మొదలు కావొచ్చని అంటున్నారు. అసలైతే సెప్టెంబర్ నుండే పుష్ప పట్టాలెక్కాల్సి ఉండగా.. పుష్ప సినిమాటోగ్రాఫర్ పోలాండ్ లో చిక్కుకుపోవడంతో ఇప్పుడు పుష్ప సినిమా సెట్స్ మీదకెళ్లడానికి టైమ్ పడుతుంది అంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలో తెలియక మాస్ లుక్ నే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సుకుమార్ తమిళ నటుడు విజయ్ సేతుపతిని సెలక్ట్ చెయ్యడము.. తర్వాత విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకోవడం తెలిసిన విషయమే. విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకోవడంపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ నడిచినా... తనకి డేట్స్ సర్దుబాటు కాకే ఈ సినిమా నుండి తప్పుకున్నాను కానీ.. మరే ఉద్దేశ్యము లేదని విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

అయితే ఆ పాత్ర నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నాక పుష్ప టీం ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలో అనే ఆలోచనలో పడ్డారట. అయితే ఇప్పుడు ఈ పాత్ర కోసం ఓ యంగ్ హీరో ని తీసుకుంటే ఎలా ఉంటుంది అని సుకుమార్ ఆలోచిస్తున్నాడట. కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ కేరెక్టర్ కోసం సుకుమార్ అండ్ టీం ఏ యంగ్ హీరో ని సెలక్ట్ చెయ్యబోతున్నాడో అనే క్యూరియాసిటీ ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది. మరి అల్లు అర్జున్ కి ధీటుగా నిలబడే ఆ యంగ్ హీరో ఎవరో సుకుమార్ అతి త్వరలోనే చెబుతాడంటున్నారు. అదే విజయ్ సేతుపతి అయితే అల్లు అర్జున్‌కి ధీటుగా కనిపించేవాడని.. మళ్ళీ అలాంటి హీరోనే వెతికి పట్టుకోవాలని సుకుమార్ వాళ్ళు చూస్తున్నారట.

Who is Pushpa Movie Villain? :

Young Hero in Pushpa Vijay Sethupathi Role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs