ప్రస్తుతం ప్రభాస్ జోరు, స్పీడు మాములుగా లేదు. ఓ రేంజ్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. బాహుబలి, సాహోలతో వచ్చిన భారీ గ్యాప్ పూడ్చడానికి అన్నట్టుగా ప్రభాస్ వరసగా సినిమాలు ప్రకటిస్తున్నాడు. తాజాగా రాధాకృష్ణతో రాధేశ్యామ్ మూవీ చేస్తున్న ప్రభాస్ తర్వాత నాగ్ అశ్విన్ మూవీ, అలాగే ఓం రౌత్‌తో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ప్రకటించడం ఇప్పుడు కన్నడ డైరెక్టర్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో మరో మూవీ ప్రకటించబోతున్నాడనే టాక్ ఉండగా.. ఇప్పుడు రాధేశ్యామ్ కన్నా, నాగ్ అశ్విన్ మూవీ కన్నా ముందు ఓం రౌత్ ఆదిపురుష్ పూర్తయ్యేలా కనబడుతుంది. కరోనా అడ్డు పడకపోతే రాధేశ్యామ్ పూర్తి చేసేవాడే ప్రభాస్.
అయితే ఇప్పుడు రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ మూవీస్ కన్నా ప్రభాస్‌కి ఆదిపురుష్ మీదే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా కనబడుతుంది. అందుకే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ ని పట్టాలెక్కించడానికి తహతహలాడుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ని ఇంకా సెట్ చేయని ఓం రౌత్.. విలన్‌గా తానాజీ ఫేమ్ సైఫ్ అలీ ఖాన్‌ని ఎంపిక చేసాడు. అయితే 2021 జనవరి నుంచి పట్టాలెక్కనున్న ఆదిపురుష్ సినిమా మొదట ఏ సీన్ ని షూట్ చేస్తారో అనేది సోషల్ మీడియాలో ఓ న్యూస్ ప్రచారం లోకొచ్చింది. ఈ సినిమా ఎక్కువగా విఎఫ్ఎక్స్ తోనే ముడిపడి ఉంది. ఇప్పటికే ప్రపంచంలోనే నెంబర్ వన్ విఎఫ్ఎక్స్ కంపెనీ కోసం సెర్చ్ చేసిందట ఆదిపురుష్ టీం.
ఇక ఇప్పుడు ఆదిపురుష్‌కి సంబంధించిన ఓపెనింగ్ షాట్స్ ఇండోర్ లోనే తీసి ఆ తర్వాత అవుట్ డోర్ షూట్ తో సినిమాని మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ఇక సినిమా బడ్జెట్ లో మేజర్ పార్ట్ అంటే 250 కోట్లు విఎఫ్ఎక్స్ కోసమే కేటాయించారని తెలుస్తుంది. టి సీరీస్ నిర్మాతలు ఆదిపురుష్ కి లెక్కలేనంత బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నారట. మరి ప్రభాస్ రాముడిగా - సైఫ్ అలీ ఖాన్ రావణ్‌గా తలపెడితే ఎలా ఉంటుందో ఓం రౌత్ ఆదిపురుష్‌లో తనదైన స్టయిల్లో చూపించబోతున్నాడట.