Advertisement
Google Ads BL

కలర్ ఫోటో ఆహాలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?


చిన్న చిన్న లఘు చిత్రాల ద్వారా కెరీర్ ప్రారంభించిన యాక్టర్ సుహాస్, కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారుతున్నాడు. సందీప్ రాజ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఇటీవలే చిత్ర షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు. చాందినీ చౌదరి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరికీ సినిమా మీద మంచి నమ్మకం కలిగింది.

Advertisement
CJ Advs

కమెడియన్ సునీల్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. టీజర్ లో విలనిజం బాగా కనిపించింది. విలన్ గా సునీల్ కి మంచి పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నారు. ఐతే ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఉండడంతో ఓటీటీ వేదిక ద్వరా విడుదల అవనుంది.

ఈ మేరకు ఆహా యాప్ తో చర్చలు జరిగాయని సమాచారం. అల్లు అరవింద్ ఈ సినిమాని ఆహా యాప్ కోసం కొనుక్కున్నాడని టాక్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నందున దీపావళి కానుకగా ఆహాలో రిలీజ్ చేస్తారట. ఈ విషయమై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి. హృదయ కాలేయం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం, కలర్ ఫోటో చిత్రానికి కథ అందించారు. అంతే కాదు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Colour Photo Will Streaming on..:

Colour Photo Will Streaming on..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs