Advertisement
Google Ads BL

హరీష్, సురేందర్ రెడ్డిల టార్గెట్.. పాలిటిక్స్!!


పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతోనే ముగించేస్తాడనుకుంటే.. కొత్తగా సురేందర్ రెడ్డి మూవీని ప్రకటించి షాకిచ్చాడు. పవన్ బర్త్‌డే రోజున పవన్ సినిమాలపై పక్కా క్లారిటీ వచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటే సినిమాల షూటింగ్ చేయబోతున్నాడని ఫిక్స్ అయ్యింది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ తో సమాజానికి ఓ మెసేజ్‌తో రాబోతుంటే.. క్రిష్ సినిమాలో చారిత్రాత్మక కథని టచ్ చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో చెయ్యబోయే సినిమాని పొలిటికల్ బ్యాగ్రౌండ్‌లో చేయబోతున్నాడనే అనుమానం హరీష్ వదిలిన పవన్ బర్త్ డే పోస్టర్ తో అర్థమైంది.

Advertisement
CJ Advs

ఇక నెక్స్ట్ మూవీ సురేందర్ రెడ్డి తో పవన్ కమిట్ అయిన మూవీ కూడా పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లోనే ఉండబోతుంది అనే టాక్ మొదలైంది. తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు చెయ్యాలి అనుకున్నది, ప్రభుత్వం మీద పవన్ పోరాటం, వచ్చే ఎన్నికల్లో పవన్ గెలుపుకు కావాల్సిన కమర్షియల్, పొలిటికల్ అంశాలతో అటు హరీష్ శంకర్ ఇటు సురేందర్ రెడ్డి మూవీస్ ఉండబోతున్నాయనేది ఫిలింనగర్ టాక్. ఈ పొలిటికల్ మూవీస్ వలన పవన్ రాజకీయ ఎత్తుగడ ఫలించేలా ఈ దర్శకులు ప్లాన్ చేస్తున్నారని వినికిడి.

Harish Shankar and Surender Reddy targets Politics:

Gossips on Surender Reddy and Harish Film with Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs