Advertisement
Google Ads BL

పవన్‌కు ఇంత ఓపికా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు!


పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునాడు చాలా సాదాసీదాగా అంటే కనీసం కేక్ కట్ చేసిన దాఖలాలు కూడా కనిపించవు. కానీ అభిమానులు మాత్రం కటౌట్స్, బ్యానర్లు కట్టడమే కాదు.. కేక్ లు కట్ చేస్తూ నానా హంగామా చేస్తూ హడావిడి చేస్తారు. అలాగే ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. తాజాగా పవన్ బర్త్ డే రోజున కటౌట్స్ కడుతూ కరెంట్ షాక్ తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన అభిమానులకి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ లో భారీ మార్పు కనిపిస్తుంది. పవన్ బర్త్ డే సందర్భంగా పవన్ కి అన్ని భాషల నటులు, పొలిటికల్ లీడర్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
CJ Advs

అయితే పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో రీ ట్వీట్స్ చేస్తూ పేరు పేరునా అందరికి హృదయ పూర్వక కృతఙతలు తెలియజేసాడు. ఇక సత్యదేవ్ లాంటి నటుడిని మీ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూసాను చాలా బావుంది అని ట్వీట్ చెయ్యగా.. అన్నయ్య చిరుకి మనస్ఫూర్తిగా  కృతజ్ఞలు తెలిపాడు. ఇక చంద్రబాబు నాయుడు కి కూడా రీ ట్వీట్ చేసిన పవన్ అన్న కొడుకులు, మేనల్లుళ్లు, మిగతా హీరోలు చిన్న నటులకి కూడా ఇలా రిప్లై ఇవ్వడం చూసిన వారు పవన్ లో ఒక్కసారిగా ఇంత మార్పా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి పవన్ అందరికి ఇచ్చిన రిప్లై ల వెనుక ఆయన పిఆర్ టీం ఉందా? లేదంటే పవన్ స్వయంగా తానే ట్వీట్ చేశాడా? అనే అనుమానం అందరిలో ఉన్నా... ఏమైనా పవన్ ఇలా అందరికి రిప్లై ఇవ్వడం మాత్రం చాలామందికి నచ్చింది.

Pawan Kalyan Gives Shock to People:

Pawan Kalyan Replay to All who wish him on his Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs