Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ గొప్పతనం.. బొమ్మరిల్లు రచయిత మాటల్లో..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్పగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆయన తెర మీద కనబడితే ఆనందం ఉప్పొంగుతుంది. నాయకుడై మన ముందు నడిస్తే కొండంత ధైర్యం గుండెల్లో నిండుతుంది. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటు ఇండస్ట్రీ నుండి, అటు రాజకీయ నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి.

Advertisement
CJ Advs

సినిమా అయినా, రాజకీయమైనా పవన్ కళ్యాణ్ రూటే సెపరేటు. అంతపెద్ద స్టార్ అయినా ఎలాంటి భేషజం ఉండదు. ఐతే పవన్ కళ్యాణ్ గొప్పతనాని గూర్చి త్రివిక్రమ్ చెప్పగా అందరం తెలుసుకున్నాం. తాజాగా మాటల రచయిత  పవన్ కళ్యాణ్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. బొమ్మరిల్లు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మాటల రచయిత అబ్బూరి రవి ట్విట్టర్ వేదికగా పవన్ కి బర్త్ డే విషెస్ చెప్తూ కొన్ని విషయాలని అందరితో పంచుకున్నాడు.

ఒక అర్థరాత్రి డిస్కషన్ మధ్యలో, నాకు నడుము నెప్పి వస్తోంది సర్ అంటే, ఠక్కున లేచి లోపలికి వెళ్పోతే కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. ఆయన చాప, దిండు తెచ్చి నన్ను పడుకోమని నా పక్కన ప్యాడ్ పెన్ పట్టుకొని కింద కూర్చుని మీరు చెప్పండి నేను రాస్తా అన్నారు. అప్పటికీ నా మొదటి సినిమా కూడా రిలీజ్ అవలేదు. కేవలం ఐదు రోజుల పరిచయం. మనిషిని మనిషి లా గౌరవించే ఆయన గుణం ఆయన వ్యక్తిత్వం లో ఒక భాగం. ఊరికే పవర్ స్టార్ అయిపోరు. ఆయన దగ్గర అబద్ధం ఆడక్కల్లేదు. చప్పట్లు కొట్టక్కల్లేదు. పొగడక్కల్లేదు. మనం మనలా ఉండచ్చు.

అన్నవరం టైం లో ఆయనకిచ్చిన నా 1983 చందమామ కధల బౌండ్ మళ్ళీ  5  సంవత్సరాల తర్వాత, పంజా సినిమా రాయడానికి ముందు ఒక అసిస్టెంట్ తో పంపించి, అందినట్టు కాల్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చారు. "పుస్తకం విలువ తెల్సిన మనిషి కి జీవితం విలువ ఖచ్చితం గా తెలుస్తుంది." బాధ వస్తే అమ్మ ఒడి ని వెతుక్కునే పసిపిల్లాడు. మంచితనం చూస్తే పరవశం. ఆడపిల్లకి అవమానం జరిగితే ఆవేశం. లేనితనం చూస్తే కంట్లో నీళ్లు. సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన, ఈ లక్షణాలు అప్పటికప్పుడు రావు. బై బర్త్ కూడా కాదు బిఫోర్ బర్త్ నించి ఉండాలి.

ఆయన వ్యక్తిత్వం నామాటల్లో చెప్పాలని పంజా సినిమా లో ప్రయత్నించాను. అప్పుడు పుట్టిన మాటలే " సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో , సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు " అని ముగించాడు. పవన్ కళ్యాణ్ కి అంతమంది అభిమానులు ఎందుకుంటారో తెలుసుకోవాలనుకున్న వాళ్లకి ఈ ఉదాహరణ సరిపోతుందేమో..!

Dialogue writer Abburi Ravi about Pawan Kalyan..:

Dialogue writer Abburi Ravi about Pawan Kalyan..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs