Advertisement
Google Ads BL

‘కెజిఎఫ్’ దర్శకుడి చిత్రం ఎన్టీఆర్‌తో కాదా?


కన్నడ కెజిఎఫ్‌తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తెలుగు హీరో ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యబోతున్నాడు.. దానికి మైత్రి మూవీస్ వారు నిర్మాతలు అంటూ అబ్బో మాములుగా ప్రచారం జరగలేదు. 300 కోట్లతో పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ తెరకెక్కుతుంది అని.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో ఫిక్స్. కెజిఎఫ్ చూసిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా కమిట్ అయ్యాడని, కథ కూడా వినకుండా సినిమా చెయ్యడానికి మైత్రి వారు ఎన్టీఆర్ ని ఒప్పించారనే టాక్ నడవడం, ప్రశాంత్ నీల్ బర్త్ డే కి ఎన్టీఆర్, ఎన్టీఆర్ బర్త్ డే కి ప్రశాంత్ నీల్ విషెస్ ట్వీట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా అని ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా ఇక్కడో ట్విస్ట్ బయటికివచ్చింది.

Advertisement
CJ Advs

అది ప్రశాంత్ నీల్ చెయ్యబోయే తెలుగు హీరో ఎన్టీఆర్ కాదని, ప్రభాస్ అనే టాక్ సోషల్ మీడియాలో రైజ్ అయ్యింది. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కాబట్టి.. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ అంటున్నారు. ఎలాగూ ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ మూవీ, నాగ్ అశ్విన్ తర్వాత ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీస్ కి కమిట్ అవడంతో పాటుగా లైన్ లోకి ప్రశాంత్ నీల్ ని తెచ్చాడని త్వరలోనే ఆ ప్రకటన కూడా రాబోతుంది అని అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ కాదు.. ప్రభాస్ అంటూ ప్రచారం షురూ అయ్యింది. మరి నిజంగా ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన వస్తే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం ఖాయం.

Prabhas23 With Prashanth Neel Under UV Creations:

Not NTR, Prabhas 23 With Sensational Director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs