Advertisement
Google Ads BL

పవన్ 28: హరీష్ అస్సలు తగ్గడం లేదుగా?


పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా పవన్ క్రేజ్ సినిమాల్లో ఏమాత్రం తగ్గలేదు. అందుకే పవన్ కళ్యాణ్‌తో సినిమా చెయ్యడానికి దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. పవన్ ఎవరిని కరుణిస్తాడో అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్‌తో ఓ పిరియాడికల్ మూవీని, హరీష్ శంకర్‌తో ఓ కమర్షియల్ మూవీని ఒప్పుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న వకీల్ సాబ్ నుంచి ఓ టీజర్ ప్లాన్ చేసింది వకీల్ సాబ్ టీం.

Advertisement
CJ Advs

ఇక తర్వాత క్రిష్ అప్‌డేట్ వస్తుందేమో అనుకుంటే.. క్రిష్ కన్నా ముందే హరీష్ శంకర్ లైన్ లోకోచ్చేసాడు. తాజాగా హరీష్ శంకర్ - పవన్ కాంబో మూవీ పై సెప్టెంబర్ సాయంత్రం ఓ అప్ డేట్ రాబోతుంది అని నిర్మాతలు అనౌన్స్ చేసారు. అసలు పవన్ కళ్యాణ్ - క్రిష్ సినిమా కన్నా ఎక్కువగా హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ సినిమా ముచ్చట్లే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్ తర్వాత లైన్ లో ఉన్న క్రిష్ కన్నా ముందే హరీష్ తన సినిమా విషయంలో కంగారు పడుతున్నట్లుగా కనబడుతుంది. మరి పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా పక్కనబెట్టి హరీష్ తో ముందుకెళ్లాలని అనుకున్నాడేమో అందుకే హరీష్ పవన్ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసి పవన్ కోసం ఇలా హడావిడి చేస్తున్నాడేమో అంటున్నారు.

Pawan Kalyan and Harish Shankar Film Update Ready:

PSPK28 Film Update on Pawan Kalyan Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs