Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ వల్లే చిరు అప్‌డేట్ ఆగిపోయిందా?


చిరంజీవి పుట్టినరోజున ‘ఆచార్య’ ఫస్ట్ లుక్‌తో పాటుగా.. మరో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్‌లో నడిచింది. మెహెర్ రమేష్‌తో ‘వేదాళం’ రీమేక్ కానీ, లేదంటే దర్శకుడు బాబీతో కొత్త సినిమా కానీ చిరు తన పుట్టినరోజున ప్రకటిస్తాడనుకున్నారు. కానీ పుట్టినరోజు వచ్చింది వెళ్ళింది.. ఎలాంటి ప్రకటనా లేదు. అయితే తాజాగా చిరు కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించడానికి అటు బాబీ కథకి కానీ, మెహెర్ రమేష్ వేదాళం రీమేక్ కథకి ఇంకా కమిట్ కాలేదని.. తాజాగా లిస్ట్‌లోకి త్రివిక్రమ్, వినాయక్‌లు రావడంతో చిరు తన కొత్త సినిమా ప్రకటన ఆపేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

గతంలో చిరు - త్రివిక్రమ్ కాంబోపై వార్తలొచ్చినా.. తాజాగా చిరుకి త్రివిక్రమ్ చెప్పిన కథ బాగా నచ్చబట్టే కొత్త ప్రాజెక్ట్ విషయంలో చిరు తొందరపడడం లేదని అంటున్నారు. ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడంతో త్రివిక్రమ్.. చిరు కథని ప్రిపేర్ చేస్తున్నాడట. చిరు - త్రివిక్రమ్ కాంబో పక్కా కమర్షియల్ సినిమా కానుందని.. అలాగే ఈ సినిమాలో దొంగ స్వామీజీల మీద ఒక మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి చిరుతో త్రివిక్రమ్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. చిరుతో మూవీని కొరటాల ‘ఆచార్య’ తర్వాత ప్రకటిస్తాడేమో చూడాలి. 

Mega Star Chiranjeevi, Trivikram Project on Cards:

Trivikram Srinivas story for mega Star Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs