Advertisement
Google Ads BL

ఈ ‘బిగ్ న్యూస్’తో తారక్ అభిమానుల్లో ఉత్సాహం!


గత ఏడాది ఎన్టీఆర్ ఆయన తండ్రి హరికృష్ణ మరణంతో పుట్టినరోజుని జరుపుకోలేదు. కనీసం ఈ ఏడాది అయినా ఎన్టీఆర్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసి.. ఆయన కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో హడావుడి చేయాలని భావించిన ఆయన అభిమానులకి కరోనా షాకిచ్చింది. కరోనా కారణంగా ఎన్టీఆర్ RRR లుక్ కూడా విడుదల కాలేదు. అలాగే త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా అప్‌డేట్ కూడా బయటికి రాలేదు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన మూవీ అప్‌డేట్ కోసం తెగ ఎదురు చూడడమే కాదు.. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా అప్‌డేట్ కోసం నిర్మాతలకు రిక్వెస్ట్ లు పెడుతున్నారట. ఎన్టీఆర్ కోసం తెగ ఎదురు చూస్తున్నాం.. కనీసం అప్‌డేట్ అయినా ఇవ్వండి అని అడుగుతున్నారట.

Advertisement
CJ Advs

దానితో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లకు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా అప్‌డేట్ ఇవ్వాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి సందేశాలు వస్తున్నాయి.. అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ కాంబో షూటింగ్ మొదలైన వెంటనే ఆ సినిమాకి సంబంధించిన ఓ బిగ్ అప్ డేట్ ఇస్తామని చెప్పడమే కాదు.. టైటిల్ విషయమై కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ టైటిల్‌ని ప్రకటించడం కూడా మాకు సెంటిమెంట్‌తో కూడిన వ్యవహారం. కాబట్టే టైటిల్‌ని ప్రకటించకుండా ఆగాము. ఈసారి మాపై నమ్మకం ఉంచండి.. ఓ పెద్ద విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నామంటూ నాగవంశీ చేసిన ట్వీట్‌తో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది.

NTR30: Naga Vamsi Says Something Big Coming NTR fans Way:

NTR Fans, Something Big Coming Your Way!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs